కర్తవ్యం విజయశాంతిని గుర్తుచేస్తున్న వరలక్ష్మీ

సినీ వారసుల్లో అబ్బాయిలు ఇండస్ట్రీలో స్థిరపడినంత త్వరగా అమ్మాయిలు నిలదొక్కుకోలేరు అన్న మాట నిజం కాదని నిరూపిస్తూ వరలక్ష్మీ శరత్ కుమార్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. కెరీర్ స్టార్టింగ్ లో గ్లామరస్ రోల్స్ లో కనువిందు చేసినా, క్రమంగా విభిన్నమైన పాత్రలు ఎంపిక చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ప్రతినాయిక రోల్స్ కూ పెద్ద పీట వేస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్ తాజాగా కర్తవ్యం విజయశాంతిని గుర్తుచేసేందుకు సిద్ధమయిందట.

రొటీన్ హీరోయిన్ రోల్స్ లో ఏముంది కిక్కు అనుకునే వరలక్ష్మీ, తాజాగా ఓ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించేందుకు సిద్ధమైందట. కంటెంట్ ఉన్న కథలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న వరలక్ష్మి 'ఛేజింగ్' అనే డబ్బింగ్ సినిమా ద్వారా త్వరలోనే తెలుగు వారి ముందుకు రాబోతోంది. ఇప్పటికే తమిళంలో విడుదలై సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సమాయత్తం అవుతోంది.

 Varalakshmi as a dynamic female cop

శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకం పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏఎన్ బాలాజీ తెలుగులో విడుదల చేయబోతున్నారు. గతంలో ఇదే బ్యానర్ పై 'ఒరేయ్ బామ్మర్ది', 'మై డియర్ భూతం' వంటి సినిమాలను తెలుగులో రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో మహిళలపై జరుగుతున్న హత్యాచారాలకు అద్దం పట్టే ఈ సినిమాలో వరలక్ష్మీ ఓ నిందితుడిని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతోంది. ఈ క్రమంలో ఫైటింగ్ సీన్స్ ఇరగదీసినట్లే కనిపిస్తోంది.

కె. వీరకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే డబ్బింగ్ పనులు పూర్తిచేసుకుంది. తశి సంగీతం అందించగా, కృష్ణ స్వామి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలే తెలుగులో విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో సినిమాను కూడా అదే రేంజ్ లో ఆదరిస్తారని చిత్ర బృందం ఆశిస్తోంది. మరి వరలక్ష్మీ నిజంగానే కర్తవ్యం విజయశాంతిని మరిపిస్తుందేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X