హానీమూన్ ట్రిప్‌లో భర్తకు టార్చర్.. వరలక్ష్మీ శరత్ కుమార్ ఏం చేసిందో మీరే చూడండి (వీడియో)
దక్షిణాదిలో అగ్ర నటిగా రాణిస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ఇటీవలే వివాహం చేసుకొని దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా డేటింగ్ చేస్తున్న తన ప్రియుడిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు. అయితే కెరీర్ పరంగా బిజీగా ఉన్న కారణంగా హానిమూన్ ట్రిప్‌కు వెళ్లడానికి వీలు కాకపోవడంతో తాజాగా ఆమె తన భర్తతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. అయితే ఈ హానీమూన్ ట్రిప్‌లో వరలక్ష్మీ చేసిన చిలిపి పనులు వివరాల్లోకి వెళితే..
ముంబైకి చెందిన నికొలాయ్ సచ్‌దేవ్ అనే వ్యాపారవేత్తతో వరలక్ష్మీ సుదీర్ఘకాలం అఫైర్‌ను కొనసాగించింది. అయితే వారిద్దరూ తమ ప్రేమను పెళ్లిగా మలిచి జూలైలో వివాహం చేసుకొన్నారు. జూలై మూడో తేదీన చెన్నైలోని విలాసిని సరై లీలా హోటల్‌లో విందు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక కోసం తెలుగు సినిమా ప్రముఖులందరినీ ఆహ్వానించారు.

అయితే తాజాగా హానిమూన్ కోసం చిన్న వెకేషన్‌ను ఓ దీవిలో ప్లాన్ చేశారు. వారిద్దరూ చిలిపిగా సమయాన్ని ఆస్వాదించారు. సరదాగా వెకేషన్‌ను గడిపారు. ఈ సందర్భంగా భర్తను ఇసుకలో ఆటాడిస్తూ వీడియోను పోస్టు చేశారు. తన ఫోటోలు తీయడానికి చేతిలో పెట్టి పరుగులు పెట్టించారు. ఆయన రకరకాల ఫోజులు పెడితూ ఆయన కెమెరాలో ఆమె అందాలను బంధించేందుకు తంటాలు పడ్డారు.
భర్త పడిన కష్టాలను వీడియోగా తీసి తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ప్రతీ భార్య క్యూట్ ఫోటోల వెనుక ఓ భర్త ఉంటాడనే విషయాన్ని మరిచిపోవద్దు. ఆమె ఒక్క ఫోటో పోస్టు చేయడానికి ఆయన కనీసం 100 ఫోటోలు పోస్టు చేసే భర్త పనితనం ఉంటుంది అని ఈ వీడియో మీద మెసేజ్ చేసింది. ఈ వీడియో ఇన్స్‌టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్నది.
ఇలాంటి బ్యూటీఫుల్ మూమెంట్స్, హానీమూన్ వెకేషన్‌కు కారణమైన ట్రావెల్‌ను ఆమె అభినందించింది. ఇది నా పెళ్లి తర్వాత వండర్‌ఫుల్ ట్రిప్. ఎప్పటిలానే ఫర్‌ఫెక్ట్‌గా ట్రిప్‌ను ప్లాన్ చేశాను. ఇది వివాహం తర్వాత చిన్న ట్రిప్ అయినా.. ఇది నాకు స్వీట్ హానీమూన్. చాలా పక్కగా ప్లాన్ చేసినందుకు ధన్యవాదాలు అని వరలక్ష్మీ శరత్ కుమార్ తన పోస్టులో పేర్కొన్నారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ విషయానికి వస్తే.. తెలుగు, తమిళంలో స్టార్ యాక్టర్‌గా రాణిస్తున్నారు. వీరసింహా రెడ్డి, హనుమాన్, యశోద, శబరి లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగులో బలమైన పాత్రలకు ఆమె అడ్డగా మారారు. పవర్‌ఫుల్ యాక్టర్‌గా క్యారెక్టర్లను, విలన్ టచ్ ఉన్న రోల్స్‌లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











