నన్ను తిట్టిన వారికీ థ్యాంక్స్.. వరలక్ష్మీ ఎమోషనల్ పోస్ట్
శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. కేవలం హీరోయిన్ పాత్రలే వేస్తానని గిరి గీసుకుని కూర్చోలేదు.. తన వద్దకు వచ్చిన పాత్రకు వంద శాతం న్యాయం చేయాలని మాత్రమే చూసింది. అందుకే నెగెటివ్ రోల్ చేసినా, గ్లామరస్ పాత్రలు చేసినా.. ఆమె నటనకు ప్రశంసలు కురుస్తూ ఉంటాయి. తాజాగా తన కెరీర్‌లో ఓ మైలురాయిని చేరుకున్న ఆనందంలో సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

బెంచ్ మార్క్..
ఇదో సుధీర్ఘమైన ప్రయాణం.. అంతేకాకుండా ఎంతో కఠినతరమైంది. మంచి పేరు అనేది అంత సులభంగా రాదని ఈ ప్రయాణం నాకు నేర్పించింది. ఇది నా లైఫ్‌లో నిజమైంది. నాకు శక్తిమేరకు నేను కష్టపడ్డాను. ప్రస్తుతం నేను ఉన్న స్థాయికి చేరుకోవడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. నేను 25 చిత్రాల బెంచ్ మార్క్‌ను పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉంది.

తిట్టిన వారికీ థ్యాంక్స్..
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. నా వెనకే ఉంటూ వెన్నుతట్టిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. అంతేకాకుండా నన్ను తిట్టిన వారికి, నాకు వ్యతిరేకంగా నిలబడిన వారికి కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మీ నెగెటివిటీ నన్ను బలవంతురాలిని చేసింది.. మీ అభిప్రాయం తప్పు అని నన్ను నిరూపించేలా చేసింది.

మంచి చెడుల్లో..
నన్ను ప్రేమించిన, ఆదరించిన, ఇంత స్థాయికి తీసుకొచ్చిన నా అభిమానులందరికీ థ్యాంక్స్. ఎలాంటి అనుమానం లేకుండా నన్ను నమ్మి మంచి పాత్రలను ఇచ్చిన నా దర్శకనిర్మాతలకు థ్యాంక్స్. నాకు ఇంత ప్రేమను, సంతోషాన్ని, విజయాన్ని, పాజిటివిటీని ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్. నా మేకప్ ఆర్టిస్ట్ రమేష్ అన్నకు, మంచిచెడుల్లో నా వెన్నంటే ఉణ్న నా మొత్తం బృందానికి థ్యాంక్స్.
Recommended Video

మీపై మీకు నమ్మకం..
25 చిత్రాలను పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటే ఉన్న మీడియాకు థ్యాంక్స్. మీ అందర్నీ ఎంటర్టైన్ చేయడానికి నా శక్తి మేరకు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాను. మిమ్మల్ని మీరు నమ్ముకోండి.. ఎదురుచూసే వారిక ఎప్పటికైనా మంచి రోజలు వస్తాయి. కలల కనండి..మీకున్న ప్రేమను పంచండి.. లవ్యూ ఆల్.. అంటూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.


Click it and Unblock the Notifications











