Varalaxmi Sarathkumar: పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి పిల్లల పుట్టిన రోజు.. ఆ ఇద్దరే తన కళ్లంటూ!

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్​హీరో, నటుడు శరత్ కుమార్ వారసురాలిగా సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదట్లో అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. కానీ గతకొంత కాలంగా మాత్రం అదిరిపోయే పాత్రల్లో నటిస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. కెరియర్ తో పాటే పర్సనల్ లైఫ్ లోనూ పెళ్లి చేసుకుని మరింత ముందుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇటీవలే ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న ఈమె.. పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి తన పిల్లల పుట్టిన రోజును ఘనంగా జరిపింది. వారే తన రెండు కళ్లు అంటూ చెబుతూ ఎమోషనల్ అయింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వరలక్ష్మీ శరత్ కుమార్ 2012లో పోదా పోడి అనే తమిళ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత అనేక చిత్రాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. అనుకున్న స్థాయిలో హీరోయిన్ గా సక్సెస్ సాధించకపోవడంతో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మారిపోయింది. ఇక అప్పటి నుంచి అనేక అద్భుతమైన సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ నటిస్తూ ఫల్ క్రేజ్ సంపాధించుకుంది. అలాగే పర్సనల్ లైఫ్ లో కూడా సెటిల్ అవ్వాలని డిసైడ్ చేసుకున్న ఈమె ప్రియుడిని పెళ్లాడబోతుంది.

Varalaxmi Sarath Kumar And Her Fiancy Sachdev Nikolay Enjoying With Their Pets Birth Day Party Check Details

మార్చి నెలలో ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు, ఆర్ట్ గ్యాలరీ యజమాని నికోలాయ్ సచ్‌దేవ్‌ తో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకుంది. కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే ఈ వేడుక జరగగా.. తాజాగా ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. వరలక్ష్మీ శరత్ కుమార్, నికోలాయ్ సచ్ దేవ్ లకు.. 14 ఏళ్లుగా స్నేహం ఉందట. ఈ క్రమంలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. అయితే పెళ్లికి ముందే ఈ జంట తమ పిల్లల పుట్టిన రోజును జరిపారు. అయితే వీరిద్దరికీ పిల్లలు ఎప్పుడు పుట్టారని షాక్ అవుతున్నారేమో. కానీ అంత షాక్ అవ్వాల్సిన పని లేదు.

ఎందుకంటే తాను ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న రెండు కుక్కపిల్లలే తన పిల్లలు అని వరలక్ష్మీ శరత్ కుమార్ ఎప్పుడూ చెబుతుంటుంది. అయితే ఇటీవలే వీరిద్దరి పుట్టిన రోజును ఒకేరోజు సెలబ్రేట్ చేసింది. ఈ వేడుకకు తనకు కాబోయే భర్త నికోలయ్ సచ్ దేవ్ వచ్చి తెగ సందడి చేశాడు. ముఖ్యంగా మార్చి 25వ తేదీకు 3ఏళ్ల పూర్తి చేసుకున్న గుక్కితో పాటు ఏప్రిల్ 2వ తేదీకి ఏడాది పూర్తి చేసుకున్న జారాలతో కేక్ కట్ చేయించారు. అయితే ఆ రెండుకుక్క పిల్లలు అంటే వరలక్ష్మికి చాలా ఇష్టం. ఆ రెండే తన రెండు కళ్లు అని చెప్పుకొచ్చిందీ క్యూట్ బ్యూటీ.

Varalaxmi Sarath Kumar And Her Fiancy Sachdev Nikolay Enjoying With Their Pets Birth Day Party Check Details

అలాగే ఈ పుట్టిన రోజు వేడుకకు వచ్చిన వాళ్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ముఖ్యంగా తనకు కాబోయే భర్తకు స్పెషల్ థాంక్స్ చెప్పింది. ఈ వేడుకలో నికోలయ్ బనియన్ పై వచ్చి తన కండలు చూపించగా.. అంతా తెగ ఎగ్డైట్ అయిపోతున్నారు. చాలా మంది ఈ వీడియోను ఇప్పుడిప్పుడే వైరల్ చేస్తున్నారు. వరలక్ష్మీ ఈ వీడియోను చాలా రోజుల క్రితమే పోస్ట్ చేయగా.. అంతా ఇప్పుడు వైరల్ అయ్యేలా షేర్ చేస్తున్నారు. పెళ్లికి ముందే కలిసి పిల్లల పుట్టిన రోజు జరపడం చాలా సంతోషంగా ఉందంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X