Varalaxmi Sarath Kumar: "నేనొక పెద్ద సార్ట్ కూతురిని, ఇంటికొచ్చి మరీ నన్నే రూంకు రమ్మన్నాడు"

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్​హీరో, నటుడు శరత్ కుమార్ వారసురాలిగా సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదట్లో అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. కానీ గతకొంత కాలంగా మాత్రం అదిరిపోయే పాత్రల్లో నటిస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. ఇటీవలే హనుమాన్ చిత్రంలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో అదిరిపోయే సినిమాతో వస్తుంది.

సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఓ బిడ్డకు తల్లిగా, సింగిల్ పేరెంట్ గా సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగానే షాకింగ్ కామెంట్లు చేసిందీ క్యూట్ బ్యూటీ. ఓ స్టార్ కూతురు అయిన తననే.. ఓ టీవీ హెడ్ తన ఇంటికే వచ్చి రూంకు రమ్మని పిలిచినట్లు చెప్పుకొచ్చింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Varalaxmi Sarath Kumar SHocking Comments About Casting Cough Check Details

వరలక్ష్మీ శరత్ కుమార్ 2012లో పోదా పోడి అనే తమిళ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత అనేక చిత్రాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. అనుకున్న స్థాయిలో హీరోయిన్ గా సక్సెస్ సాధించకపోవడంతో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మారిపోయింది. ఇక అప్పటి నుంచి అనేక అద్భుతమైన సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ నటిస్తూ ఫల్ క్రేజ్ సంపాధించుకుంది.

ప్రస్తుతం 38 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ఎంగేజ్ మెంట్ చేసుకుని షాక్ ఇచ్చింది. ఇలా పర్సనల్ లైఫ్ లో ముందుకు వెళ్తున్న ఈమె ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా దూసుకు పోతుంది. ముఖ్యంగా శబరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మే 3వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేస్తోంది వరలక్ష్మి. ఈక్రమంలోనే వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. అయితే తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేసింది.

Varalaxmi Sarath Kumar SHocking Comments About Casting Cough Check Details

కెరియర్ స్టార్టింగ్ లో తాను కూడా చాలా సమస్యలు ఎదుర్కున్నట్లు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా స్టార్ కూతురును అయిన తనను.. ఓ టీవీ డైరెక్టర్ రూంకు రమ్మని పిలిచినట్లు చెప్పుకొచ్చింది. నేరుగా తన ఇంటికే వచ్చి మళ్లీ కలుద్దాం అని, ఎందుకు అని అడిగితే రూం బుక్ చేస్తాను, పర్సనల్ గా మాట్లాడుకుందామంటూ చెప్పినట్లు తెలిపింది. స్టార్ హీరో కూతురు పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదని వివరించింది. అందుకే తాను శక్తి ఫౌండేషన్ ప్రారంభించి.. కష్టాల్లో ఉన్న ఆడపిల్లలకు సాయం చేస్తున్నట్లు వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X