ప్రెగ్నెన్సీ సీక్రెట్ బయట పెట్టిన వరలక్ష్మి.. అనుకోకుండానే జరిగిపోయింది అంటూ!
సౌతిండియాలో కూడా చాలా మంది స్టార్ కిడ్‌లు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు. అందులో కొందరు హీరోయిన్లుగా ఓ రేంజ్‌లో ప్రభావాన్ని చూపిస్తున్నారు. అలాంటి వారిలో శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి ఒకరు.
గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌లోనూ మెప్పించే ఈ భామ.. ఎన్నో భాషల్లో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఫలితంగా చేతి నిండా ఆఫర్లతో సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వరలక్ష్మి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రెగ్నెన్సీ, పెళ్లి గురించి మాట్లాడింది. ఆ సంగతులు మీకోసమే!

ఆరంభంలోనే సెన్సేషన్
శరత్‌కుమార్ కూతురిగా ఎప్పుడో సుపరిచితురాలు అయిన వరలక్ష్మి 'పోడా పొడి' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఆ తర్వాత కన్నడంలో సహా ఎన్నో భాషల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. దీనికితోడు హీరో విశాల్‌తో ప్రేమాయణం సాగించడం.. తర్వాత బ్రేకప్ చెప్పడంతో సౌతిండియా మొత్తం ఆమె పేరు సెన్సేషన్ అయిన విషయం తెలిసిందే.

క్రేజీ రోల్స్‌తో స్టార్‌డమ్
వైవిధ్యమైన నటనతో ఆరంభంలోనే స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న వరలక్ష్మి.. 'విక్రమ్ వేదా', 'విష్మయ', 'మానిక్యా', 'కసాబా' వంటి చిత్రాల్లో అదిరిపోయే యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. ఇక, 'పందెం కోడి 2', 'సర్కార్' వంటి చిత్రాల్లో లేడీ విలన్‌గానూ కనిపించి తనలోని మరో యాంగిల్‌తో రచ్చ చేసింది. అప్పటి నుంచి ఆమె విభిన్నమైన పాత్రలను చేస్తూ వెళ్తోంది.
తెలుగులో సక్సెస్‌ఫుల్
వరలక్ష్మీ శరత్ కుమార్ 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంటరైంది. దీని తర్వాత 'క్రాక్'లో ఆమె పోషించిన జయమ్మ అనే పాత్రతో భయపెట్టింది. అనంతరం ఈ అమ్మడు తెలుగులో 'నాంది', 'యశోద' వంటి చిత్రాల్లో నటించి హిట్లను సాధించింది. ఈ క్రమంలోనే 'వీర సింహా రెడ్డి', 'హనుమాన్'తో భారీ విజయాలను అందుకుంది.

ఫుల్ బిజీ.. నిశ్చితార్థం
ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో 'శబరి' అనే సినిమాను చేస్తోంది. అలాగే, మలయాళంలో 'కలర్స్', తమిళంలో 'రాయన్' వంటి చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ఇలా కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే వరలక్ష్మి కొద్ది రోజుల క్రితమే నికోలయ్ సచ్‌దేవ్ అనే ఆర్ట్ గ్యాలరీ ఓనర్‌తో నిశ్చితార్థం చేసుకుంది. అలాగే త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది.
పెళ్లి, ప్రెగ్నెన్సీ ప్లాన్స్
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న వరలక్ష్మి శరత్‌కుమార్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన సినిమా కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంది. అలాగే, తన పర్సనల్ లైఫ్ విశేషాలపైన కూడా మాట్లాడింది. ఈ క్రమంలోనే పెళ్లి, ప్రెగ్నెన్సీ గురించి చేసుకున్న ప్లాన్లపై తొలిసారిగా వివరించింది.

అప్పుడే పెళ్లి అనుకుని
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విలక్షణ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. '22 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేను నటిగా పరిచయం అయ్యాను. 28 ఏళ్ల లోపు స్టార్ హీరోయిన్‌గా అవ్వాలని అనుకున్నాను. అలాగే అయ్యాను కూడా. నా గోల్ రీచ్ అయిన తర్వాత అంటే 32 ఏళ్లకు వివాహం చేసుకోవాలని అనుకున్నాను' అంటూ చెప్పుకొచ్చింది.
పెగ్నెన్సీపైన కూడా
వరలక్ష్మి కంటిన్యూ చేస్తూ.. 'పెళ్లైన రెండేళ్లకు తల్లి అవ్వాలని భావించాను. కానీ నేను వేసుకున్న ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఇదంతా అనుకోకుండానే జరిగిపోయింది. ప్రస్తుతం నా వయసు 38 ఏళ్లు. ఈ ఏజ్‌లో పెళ్లి చేసుకుంటున్నాను. ఎప్పటికి పిల్లలు అవుతారు అనేది చెప్పలేను. మొత్తానికి ఇలా నేను ప్లాన్ చేసుకున్నది అంతా ఫెయిల్ అయింది' అంటూ వివరించింది.


Click it and Unblock the Notifications











