twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనమంతా కరోనాతో చావడం కరెక్టే.. మనకు బతికే హక్కులేదు.. వరలక్ష్మీ శరత్ కుమార్ ఫైర్

    |

    తమిళ నాడులో మరో దుర్ఘటన జరిగింది. ఇప్పటికే జయరాజ్, ఫినిక్స్ తండ్రీ కొడుకుల ఘటన దేశాన్ని కుదిపేయగా.. ప్రస్తుతం జయప్రియ ఘటన సమాజాన్ని ప్రశ్నిస్తోంది. ఏడేళ్ల బాలికను రేప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనపై సెలెబ్రిటీలు ఆవేదన చెందుతున్నారు. తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఎమోషనల్ అయింది. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది.

    ఏడేళ్ల బాలికపై..

    ఏడేళ్ల బాలికపై..

    తమిళనాడులో పుదుకొట్టాయ్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. జయప్రియ (7)పై ముగ్గురు దుండగులు అత్యాచారం చేశారు. ఆపై ఆ బాలిక చంపేశారు. ఈ ఘటనపై తమిళ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలో #JusticeforJayapriya అనే హ్యాష్ ట్యాగ్‌తో న్యాయ పోరాటం చేస్తున్నారు. తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ స్పందించింది.

    బ్లడీ హెల్..

    బ్లడీ హెల్..

    జయప్రియ ఘటనపై వరలక్ష్మీ స్పందిస్తూ.. ‘వాట్ ది బ్లడీ హెల్.. ఏం జరుగుతోంది అసలు.. మరో బాలికను దారుణంగా రేప్ చేసి చంపారు. మనకు తెలుసా ఇలాంటి ప్రపంచంలో బతుకుతున్నామని, మనందరిం కరోనా సోకి చావడానికి అర్హులమే. మనుషులుగా అదే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటాను. మనకు బతికే హక్కులేద'ని ఫైర్ అయింది.

    ఉరి శిక్ష వేయండి..

    ఉరి శిక్ష వేయండి..

    తాజాగా మళ్లీ ఆ ఘటనపై ఆవేదన చెందింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా షేర్ చేసింది. ‘అందరికీ నమస్కారం.. ఈ వీడియో ద్వారా మన ముఖ్యమంత్రికి ఓ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఏడేళ్ల బాలికను ముగ్గురు రేప్ చేసి చంపారు. మన చట్టాలు, న్యాయవ్యవస్థ ఏం చేస్తాయంటే అరెస్ట్ చేసి విచారణ పేరుతో కొన్నేళ్లు సాగదీస్తారు. అందుకే భయం లేకుండాపోతోంది. మళ్లీ మళ్లీ అదే నేరాలు చేస్తున్నారు. అందుకే రేప్ చేసిన వారికి వెంటనే ఉరి శిక్ష వేయండి.. దయచేసి చట్టాలను మార్చండి.. మిమ్మల్ని అడుక్కుంటున్నాను' అని ముఖ్యమంత్రికి విన్నవించుకుంది.

    Recommended Video

    Radhika Sarathkumar Slapped Actor Sudhakar, Here's why
    మొదటి రాష్ట్రం కావాలి..

    మొదటి రాష్ట్రం కావాలి..

    వీడియోను షేర్ చేస్తూ వరలక్ష్మీ చేసిన ట్వీట్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ‘రేప్‌కు గురైన పిల్లలు, మహిళల తరుపున మిమ్మల్ని అడుక్కుంటున్నాను.. ఉరిశిక్షను వేసేలా ఓ చట్టాన్ని రూపొందించండి తద్వారా.. చిన్న పిల్లలపై, మహిళలపై జరిగే అఘాయిత్యాలను ఉపేక్షించని రాష్ట్రంగా మిగతా వారికి స్ఫూర్తిగా నిలుద్దామ'ని చెప్పుకొచ్చింది.

    English summary
    varalaxmi Sarathkumar Emotional On Justice for Jayapriya. please sir I'm begging you..on behalf of all the children and women who have been raped..pass the order..be the first state to be an example, that we will not tolerate the abuse of women and children..plzz..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X