నా పెళ్లి గురించి మళ్లీ మాట్లాడితే.. ముడ్డి మీద తన్నుతా.. నన్నెవరూ అంటూ వరలక్ష్మీ ఫైర్
2018లో దక్షిణాది చిత్ర పరిశ్రమలో పవర్‌ఫుల్ పాత్రలతో కేక పుట్టించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం కలిగి ఉంటుంది. ఏ విషయాన్నానైనా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఈ ఏడాది ఆమె నటించిన పందెంకోడి2, సర్కార్ చిత్రాలు ఘనవిజయాన్ని సొంతం చేసుకొన్నాయి. అయితే వరలక్ష్మీ, హీరో విశాల్ మధ్య అఫైర్, డేటింగ్ అంటూ కొన్ని వార్తలు మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఆమె పలుమార్లు స్పష్టం చేశారు. అయితే మళ్లీ అలాంటి వార్తలు రావడంతో వరలక్ష్మీ సోషల్ మీడియాలో భగ్గుమన్నారు. అసలేం జరిగిందంటే...

విశాల్‌తో పెళ్లి గురించి
ఇటీవల సర్కార్ మూవీ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. విశాల్‌తో స్నేహ బంధం మాత్రమే. మా మధ్య అంతకు మించిన రిలేషన్ గానీ, డేటింగ్ గానీ లేదు. ఇక విశాల్‌ను పెళ్లి చేసుకోనని పదేపదే ఆమె స్పషం చేశారు. అయితే మళ్లీ విశాల్‌తో పెళ్లి అనే వార్త మీడియాలో రావడంతో వరలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొందరు పనికిమాలిన వాళ్లు
ఎప్పటిలానే ఏడాది ముగింపులో కొందరు పనికి మాలిన వాళ్లు ఏదో హడావిడిగా వార్తను రాయడానికి అవాస్తవాలను మీడియాలో గుప్పించారు. నేను పెళ్లి చేసుకొంటున్నాను అని వార్తా కథనాన్ని వండివార్చారు. నేను పెళ్లి చేసుకోవడం లేదు అని మరోసారి నేను స్పష్టం చేస్తున్నాను వరలక్ష్మీ ట్వీట్ చేశారు.

నా గురించి చెత్త రాతలు రాస్తే
నేను పెళ్లి చేసుకొని పరిశ్రమను వదిలేస్తానని కొందరు కలలు కంటున్నారు. నేను ఎక్కడికి పోను ఇక్కడే ఉండి నటిస్తూనే ఉంటాను. అలాంటి చెత్త రాతలు రాసే వారి ముడ్డి మీద తన్నడం ఖాయం. నా స్టేట్‌మెంట్‌తో భంగపడిన వారికి బెటర్ లక్ నెక్ట్స్ టైం. ఎన్ని నాటకాలు ఆడినా నన్ను ఎవరూ తొక్కేయ్యలేదు అంటూ వరలక్ష్మీ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

వరలక్ష్మీ అండగా నెటిజన్లు
తన పెళ్లిపై గాసిప్స్ రాసిన వారికి గట్టిగా సమాధానం ఇచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్‌కు సోషల్ మీడియాలో నెటిజన్లు అండగా నిలిచారు. అద్భుతంగా సమాధానం చెప్పావంటూ కొందరు ట్వీట్ చేయగా.. వాటిని శరత్ కుమార్ రీట్వీట్ చేశారు.

టెలివిజన్ కార్యక్రమంతో
ఇదిలా ఉండగా, వరలక్ష్మీ శరత్ కుమార్ వరుస సినిమాలతో దూసుకెళ్తూనే జయ టెలివిజన్‌లో సామాజిక చైతన్యాన్ని కలిగించే ఉన్నైఅరిందల్ అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నాడు. ఈ సంవత్సరాన్ని ఈ కార్యక్రమాన్ని నిర్వహించే నా కుటుంబ సభ్యులతో ముగిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది తమ నైజాన్ని మార్చుకొటున్నారు. వచ్చే ఏడాది సమాజంలో మరింత మార్పు తెచ్చేందుకు ప్రయత్నిద్దా అని వరలక్ష్మీ శరత్ కుమార్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











