Varalaxmi Sarathkumar: వరలక్ష్మిని ఇలా బికినీలో ఎప్పుడైనా చూసారా.. సోషల్ మీడియా అల్లకల్లోలం!
వరలక్ష్మి శరత్ కుమార్ అంటే ఇప్పుడు ఒక యాక్టర్ కాదు ఆమె ఒక బ్రాండ్ అని చెప్పాలి. ముఖ్యంగా పవర్ఫుల్ విలన్ రోల్స్ కు ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఎలాంటి పాత్ర చేసిన కూడా సినిమాలో హీరోలతో సమానంగా హైలైట్ అయ్యే విధంగా కూడా నటిస్తున్నారు. ఇక తెలుగులో అయితే ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక అలాంటి వరలక్ష్మీ శరత్ కుమార్ బికినీలో ఒకసారి కనిపించింది. అయితే ఆ పాత ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట హీరోయిన్ గా సినిమాలు
వరలక్ష్మి శరత్ కుమార్ ఒకప్పుడు హీరోయిన్ గా అడుగులు వేసింది. విశాల్ తో కూడా ఆమె సినిమా చేసింది. అయితే ఎక్కువగా మాత్రం ఆమెకి హీరోయిన్ గా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన విజయాలు మాత్రం దక్కలేదు. సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి మొదట్లో మంచి క్రేజ్ అందుకుంది. కానీ ఆ తర్వాత మెల్లగా హీరోయిన్ గా అయితే ఫ్లాప్స్ అందుకుంది.

విజయ్ తో పవర్ఫుల్ రోల్
ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత వరలక్ష్మి సినిమాలకు ఒక టైమ్ లో బ్రేక్ ఇచ్చింది. ఇక మళ్ళీ సరికొత్తగా తనను తాను ప్రజెంట్ చేసుకుంటూ విభిన్నమైన పాత్రల్లో కనిపించడం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా విజయ్ నటించిన సర్కార్ సినిమాలో ఆమె విలన్ పాత్ర బాగా వర్కౌట్ అయింది. అలాంటి పాత్ర ఒక ఎవరు చేయలేరు అనే విధంగా ఆమె గుర్తింపు అందుకోవడం విశేషం.

ఆ ఒక్క పాత్రతోనే..
ఇక తెలుగులో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ కు మంచి క్రేజ్ పెరుగుతోంది. ఆమె రవితేజ క్రాక్ సినిమాలో విలన్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. జయమ్మ అనే పాత్రలో వరలక్ష్మి అద్భుతమైన హవ భావాలతో మెప్పించింది. సినిమా విజయంలో ఆమె కీలక పాత్ర పోషించింది అనే చెప్పాలి. ఇక తెలుగులో ఆ తర్వాత ఎలాంటి సినిమా చేసిన కూడా జయమ్మ అనే పేరుతోనే జనాలు ఎక్కువగా పిలుచుకుంటున్నారు.

పాజిటివ్ రోల్స్ కూడా..
ఇక నాంది సినిమాలో కూడా అల్లరి నరేష్ తో ఆమె మంచి పాజిటివ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. అలాంటి పాత్రలు కూడా చేయగలను అని నిరూపించుకున్నారు. ఇక ఇటీవల నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలో కూడా ఒక నెగిటివ్ పాత్రలో కనిపించింది. అంతేకాకుండా మంచి ఎమోషన్ తో కూడా వరలక్ష్మి మెప్పించే ప్రయత్నం చేసింది.

గ్లామర్ గర్ల్ గా షాకింగ్ ఫొటోలు
అయితే వరలక్ష్మి శరత్ కుమార్ ఎప్పుడూ కూడా సినిమాల్లో పవర్ఫుల్ పాత్రలో కనిపించడమే కాకుండా తన పర్సనల్ లైఫ్ లో మాత్రం గ్లామర్ గల్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది. హాలిడేస్ కు వెళ్లే ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పొట్టి దోస్తుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించింది అంటే ఆ ఫోటోలు నిమిషాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి.

బికినీ లుక్స్ తో అల్లకల్లోలం
అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ గతంలో బికినీ లుక్ లో కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఒక విధంగా వరలక్ష్మి ఆ బికినీ ఫోటోల్లో కనిపించి అల్లకల్లోలం సృష్టించింది అనే చెప్పవచ్చు. త్వరలోనే ఆమె పుట్టినరోజు కావడంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఈ విధంగా గ్లామరస్ బికినీ ఫోటోలను వైరల్ అయ్యేలా చేస్తున్నారు. మరి వెండితెరపై ఇలాంటి పాత్రలో వరలక్ష్మీ కనిపిస్తే మాత్రం వెండితెర షేక్ అవుతుంది అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











