న్యూడ్‌గా ఉంటే పోసేస్తారు, ఇంతకంటే బెటర్‌గా ఎవడు చెప్పడు.. వరలక్ష్మీ శరత్‌కుమార్ షాకింగ్ ఫొటో
కొంతమంది నటీమణులు చేసే కామెంట్స్ చాలా ఘాటుగా ఉంటాయి. పబ్లిసిటీ కోసం జనాలు ఎట్రాక్ట్ అవ్వాలని బోల్డ్ గా మాట్లాడే హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. అయితే సమాజం కోసం ఆలోచించి పచ్చిగా మాట్లాడే వారు తక్కువ మంది ఉంటారు. అలాంటి కొంతమంది నటిమణుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. సీనియర్ నటుడు శరత్ కుమార్ మొదట భార్య తనయురాలైన వరలక్ష్మి ఇటీవల సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.

హీరోలతో సమానంగా పవర్ఫుల్ రోల్స్
వరలక్ష్మి శరత్ కుమార్ మొదట హీరోయిన్ గానే కోలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. అయితే ఆమె హీరోయిన్ గా కంటే సపోర్టింగ్ రోల్స్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా నెగిటివ్ రోల్స్ ఆమెలోని అసలు టాలెంట్ ని బయటపెట్టాయి. హీరోలతో సమానంగా పవర్ఫుల్ పర్ఫెమెన్స్ ఇవ్వగలదని సర్కార్ సినిమాతో తానేంటో నీరూపించుకుంది.

పచ్చిగా వివరణ ఇచ్చిన నటి
అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల వరలక్ష్మి ఒక సందేశాన్ని చాలా ఘాటుగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం కోవిడ్ 19 తగ్గిందని కొందరు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇంకా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గలేదని వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చాలానే హెచ్చరిస్తున్నారు. ఇక అదే విషయంపై వరలక్ష్మి చాలా పచ్చిగా వివరణ ఇచ్చారు.

న్యూడ్ గా తిరిగితే పోసేస్తారు
మాస్క్ ధరించడం చాలా ముఖ్యమైన విషయమని ఒక ఉదాహరణను కూడా జాతచేసింది. ఒకవేళ వంటిపై బట్టలు లేకుండా చుట్టూ న్యూడ్ గా తిరిగినపుడు.. ఎవడైనా మూత్రం పోస్తే తడిగా అవుతుంది. ఇక ప్యాంట్ ధరించినపుడు ఎవరైనా మూత్రం పోస్తే పాక్షికంగా రక్షణగా ఉంటుంది. ఇక పోసేవాడు ప్యాంట్ వేసుకొని అందులోనే మూత్రం పోసుకుంటే.. అప్పుడు మీకు తడి అవ్వదు... అని వరలక్ష్మి ఒక ఉదాహరణ ఇచ్చింది.

ఇంతకంటే మంచి వివరణ మరొకటి లేదు
కోవిడ్ కష్టకాలంలో మాస్క్ ధరించడం తప్పనిసరి అని చెప్పిన వరలక్ష్మి ఇంతకంటే మంచి వివరణ మరొకటి లేదని పేర్కొంది. ప్రతి ఒక్కరు సేఫ్ గా ఉండి మాస్కులను ధరించాలని, కోవిడ్ ప్రస్తుతం ప్రతి చోట ఎక్కువగా ఉందని అందుకే బాధ్యతగా ఉండాలని వరలక్ష్మీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దీంతో నెటిజన్లు కూడా ఆమె వివరణ ఇచ్చిన విధానంపై పాజిటీవ్ గా స్పందిస్తున్నారు.
Recommended Video

10కి పైగా సినిమాలు.. తెలుగులో కూడా
ప్రస్తుతం వరలక్ష్మి కోలీవుడ్ లోనే కాకుండా ఇతర సినిమా ఇండస్ట్రీలో కూడా బిజీ ఆర్టిస్టుగా మారింది. తెలుగులో ఆమె సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ BA.BL సినిమా ద్వారా పరిచయమైన విషయం తెలిసిందే. ఇక రవితేజ క్రాక్ సినిమాలో అలాగే నరేష్ నాంధి సినిమాలో కూడా ఆమె కీలకమైన పాత్రల్లో నటిస్తోంది. మొత్తంగా తమిళ్ తెలుగులో కలిపి 10 సినిమాలతో బిజీగా ఉంది వరలక్ష్మి.


Click it and Unblock the Notifications











