ఫీలింగ్ వచ్చి పోయింది, రోజూ అదే మొహం చూడాలా? పెళ్లిపై వరలక్ష్మి సంచలనం

Recommended Video

Varalakshmi Interview @Sarkar Movie | Filmibeat Telugu

తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. గతంలో ఆమె విశాల్‌తో ప్రేమలో ఉందనే వార్తలు సైతం వినిపించాయి. అయితే తమ మధ్య అలాంటిదేమీ లేదని, విశాల్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని తేల్చి చెప్పింది ఈ చెన్నై సుందరాంగి. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని అడిగితే... తనకు అసలు అలాంటి ఉద్దేశ్యమే లేదని, అసలు పెళ్లి చేసుకోవడం వల్ల ఏమిటి ఉపయోగం? ఎవరికి ఉపయోగం అంటూ తనదైన శైలిలో ఎదరు ప్రశ్నిస్తోంది వరలక్ష్మి. పెళ్లి చేసుకోవడం అంటే టైమ్ వేస్ట్ చేయడమే అంటోంది.

పెళ్లి అనేది ఎవరికీ యాంబిషన్ కాకూడదు

పెళ్లి అనేది ఎవరికీ యాంబిషన్ కాకూడదు

పెళ్లి అనేది ఎవరికీ ఒక యాంబిషన్ కాకూడదు. పాలిటిక్స్ రావడం అనేది ఒక యాంబిషన్, ఒక మంచి పని చేయాలనేది ఒక యాంబిషన్. పెళ్లి చేసుకుని మీరు ఏం చేస్తారు? దాని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? అంటూ వరలక్ష్మి వ్యాఖ్యానించారు.

రోజూ అదే మొహం చూస్తూ కూర్చోవాలి

రోజూ అదే మొహం చూస్తూ కూర్చోవాలి

లవ్ చేస్తే పెళ్లి చేసుకోవచ్చు. లేకుంటే వారితో ఎలా టైమ్ స్పెండ్ చేయగలం. ఇది వేస్ట్ ఆఫ్ టైమ్. రోజూ అదే మొహం చూస్తూ కూర్చోవాలి. ఎవరి కోసం చూడాలి. మనం ప్రేమించినపుడు మాత్రమే అతడి మొహం చూస్తూ ఉండగలం. లేకుంటే అలా ఉండటం కష్టం.... అని వరలక్ష్మి అన్నారు.

సమాజం కోసం, ఇంట్లో వారి కోసం అవసరమా?

సమాజం కోసం, ఇంట్లో వారి కోసం అవసరమా?

ప్రేమ లేకుండా కేవలం సమాజం, ఇంట్లో వారి కోసం పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. మనం పెళ్లి చేసుకుంటున్నామంటే దానికి ప్రేమ అనే ఒక కారణం ఉండాలి. ప్రేమించినపుడు మాత్రం అతడితో కలిసి జీవించాలనే కోరిక ఉంటుంది. అలాంటపుడు పెళ్లి చేసుకోవచ్చు అని స్పష్టం చేశారు.

 ఆయన్ని పెళ్లి గురించి ఎవరైనా అడుగుతారా?

ఆయన్ని పెళ్లి గురించి ఎవరైనా అడుగుతారా?

ఇపుడు సల్మాన్ ఖాన్ సింగిల్ గానే ఉన్నారు. ఆయన దగ్గరకు పోయి ఎవరైనా మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదని అడుగుతారా? ఉమెన్ కూడా అలాగే ఉండొచ్చు... అంటూ వరలక్ష్మి వ్యాఖ్యానించారు.

పిల్లలు కావాలంటే దత్తత తీసుకోవచ్చు

పిల్లలు కావాలంటే దత్తత తీసుకోవచ్చు

ఇపుడు ఒక మహిళ... పురుషుడిపై ఆధార పడకుండా జీవించే పరిస్థితులు ఉన్నాయి. అలాంపుడు ప్రేమ లాంటివి లేకుండా కేవలం వారిపై ఆధారపడటానికే పెళ్లి కోవడం ఎందుకు? పిల్లలు కావాలనుకుంటే దత్తత తీసుకోవచ్చని తెలిపారు.

 లవ్ ఫలింగ్ వచ్చింది, పోయింది

లవ్ ఫలింగ్ వచ్చింది, పోయింది

లవ్ అనే ఫీలింగ్ ఎవరి మీదా రాలేదా? అనే ప్రశ్నకు వరలక్ష్మి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆ ఫీలింగ్ వచ్చింది.. పోయింది.. వచ్చింది... పోయింది. మనల్ని మనం హ్యాండిల్ చేసుకున్నపుడు, మన సక్సెస్ హ్యాండిల్ చేసుకున్నపుడు మనం చాలా సెక్యూర్ గా ఉంటాము. దురదృష్ట వశాత్తు చాలా మంది మగాళ్లు మనల్ని చూసి ఇన్ సెక్యూర్‌గా ఉంటారు అని వ్యాఖ్యానించారు.

లేదంటే ఇలాగే ఒంటరిగా ఉండిపోతా

లేదంటే ఇలాగే ఒంటరిగా ఉండిపోతా

ఒక మగాడు పెళ్లి తర్వాత తన జాబ్ వదులుకోవడానికి సిద్ధంగా లేనపుడు... నా జాబ్ వదిలేసి నేనెందుకు పెళ్లి చేసుకోవాలి. అలాంటి మనిషి ఒకడు పుడితే నా జీవితంలోకి వస్తాడు.. లేదంటే నేను ఇలాగే ఒంటరిగా ఉంటాను... అంటూ వరలక్ష్మి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X