For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీవితంలో ఎవరినీ పెళ్లి చేసుకోను.. వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు.. వరలక్ష్మీ సెన్సేషనల్‌గా

|

దక్షిణాదిలో ఫైర్ బ్రాండ్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తొచ్చేది వరలక్ష్మీ శరత్ కుమార్. వరలక్ష్మీ పోషించే పాత్రలే కాకుండా.. ఆమె వ్యక్తిగత జీవితం, ఆమె చేసే కామెంట్లు కూడా హాట్ హాట్‌గా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఏ విషయంపైనైనా ఎలాంటి మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుంది. తాజాగా కన్యారాశి సినిమా ప్రమోషనల్‌లో వరలక్ష్మీ చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్‌గా మారాయి. పెళ్లి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

కన్యరాశి సినిమా గురించి

కన్యరాశి సినిమా గురించి

కన్యరాశి గురించి మాట్లాడుతూ.. నాకు కొత్త దర్శకులతో పనిచేయడం అంటే చాలా ఇష్టం. ఈ సినిమా స్క్రిప్టు చదివేటప్పుడు పడిపడి నవ్వాను. కథ నచ్చడంతో ఆ తర్వాత వెంటనే ఈ సినిమాలో నటిస్తానని చెప్పాను. ప్రేమ వివాహం ప్రాముఖ్యతను చెప్పే సినిమా కథ అది. అందరికీ నచ్చే విధంగా ఉంటుంది అని వరలక్ష్మీ శరత్ కుమార్ అన్నారు.

ప్రేమ వివాహం చేసుకొంటారా?

ప్రేమ వివాహం చేసుకొంటారా?

ఇక మీరు కూడా ప్రేమ వివాహం చేసుకొంటారా అనే ప్రశ్నకు వరలక్ష్మీ సమాధానం ఇస్తూ.. జీవితంలో నేను పెళ్లే చేసుకోను. నాకు వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు. కాబట్టి పెళ్లికి నేను దూరంగా ఉంటాను అని స్పష్టం చేశారు. వరలక్ష్మీ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలనే కాదు.. అభిమానులను కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయనే మాట వినిపిస్తున్నది.

విశాల్‌తో ప్రేమ, పెళ్లి గురించి

విశాల్‌తో ప్రేమ, పెళ్లి గురించి

ఇటీవల కాలంలో హీరో విశాల్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. వరలక్ష్మీ, విశాల్ పెళ్లి పీటలు ఎక్కుతున్నారనే వార్త కూడా మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. కానీ అనూహ్యంగా విశాల్, వరలక్ష్మీ దూరం కావడం ఎవరికీ అంతుపట్టలేదు. ఆ తర్వాత విశాల్ హైదరాబాదీ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో ఆ వార్తలకు తెరపడింది.

 విశాల్‌తో అలాంటి రిలేషన్ లేదు

విశాల్‌తో అలాంటి రిలేషన్ లేదు

విశాల్‌తో ప్రేమ వ్యవహారాన్ని ఎప్పుడు ప్రస్తావించినా.. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. మా మధ్య అలాంటి బంధానికి అవకాశం లేదు. మా మధ్య ప్రేమ, పెళ్లి గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదు. మా ఇద్దరి రిలేషన్ ప్రొఫెషన్ వరకే. ఒకవేళ విశాల్ పెళ్లి చేసుకొంటానంటే చాలా సంతోషంగా అతడికి అమ్మాయిని వెతికిపెడుతాను. అతడు పెళ్లి చేసుకొంటే సంతోషించే వాళ్లలో నేను ముందుంటాను అని వరలక్ష్మీ పలుమార్లు స్పష్టం చేసింది.

English summary
Varalaxmi Sarathkumar is now doing a project Kannirasi. Part of the promotion of the movie, She said, Though the film highlights the importance of love marriage, I will not marry anyone in real life. I don't believe in the institution of marriage."
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more