అలాంటి తప్పులు చేస్తే.. అది కట్ చేయాలి.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

Varalaxmi Sarathkumar: తమిళ్, తెలుగు ఇండస్ట్రీల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్. ప్రస్తుతం ఈ అమ్మడు కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇప్పుడు దర్శకురాలిగా కూడా అడుగుపెడుతోంది. వరలక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన సినిమా 'సరస్వతి'. ఈ సినిమా మార్చి 6న విడుదలకు సిద్ధమైంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా వరలక్ష్మి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది.

సరస్వతి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల కిసిక్ టాక్ పాల్గొంది. ఈ సందర్భంగా వరలక్ష్మి సమాజంలో జరుగుతున్న అనేక అంశాలపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించింది. ముఖ్యంగా చిన్నపిల్లలపై పెరుగుతున్న అఘాయిత్యాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా వరలక్ష్మిని 'ఇలాంటి ఘటనలు విన్నప్పుడు మీకేమనిపిస్తుంది?’ అని ప్రశ్నించగా, ఆమె చాలా కఠినంగా స్పందించింది.

Varalaxmi Sarathkumar Shocking Comments on Child Abuse Politics During Saraswathi Promotions

పిల్లలపై జరుగుతున్న దారుణాలపై మాట్లాడిన వరలక్ష్మి... 'పేరెంట్స్ తప్పనిసరిగా పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి నేర్పించాలి. పిల్లలతో ఈ విషయాలు మాట్లాడటానికి చాలా మంది తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. కానీ చేయడంలో సమస్య లేదు కానీ మాట్లాడడంలో ఇబ్బంది పడటం ఎంతవరకు సరైంది?' అంటూ ప్రశ్నించింది. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు మరింత అవగాహనతో ఉండాలని ఆమె సూచించింది.

అలాగే పిల్లలపై అఘాయిత్యాలు చేసే నేరస్థులపై కూడా ఆమె ఘాటుగా స్పందించింది. 'నా చేతిలో అధికారం ఉంటే ఇలాంటి నేరాలు చేసే వారిని చాలా కఠినంగా శిక్షిస్తాను. డెత్ పెనాల్టీ ఇవ్వడం చాలా ఈజీ. కానీ వారు చేసిన తప్పు జీవితాంతం గుర్తుండేలా ఉండాలి అంటే వారికి మరింత కఠినమైన శిక్ష విధించాలి. అలాంటి పనులు చేసేవాళ్లకు అది కట్ చేయాలి ' అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీశాయి.

ఇంటర్వ్యూలో వరలక్ష్మి తన వ్యక్తిగత జీవితంపై కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'మీది లవ్ మ్యారేజ్ లేదా అరేంజ్డ్ మ్యారేజ్?' అని అడిగినప్పుడు ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చింది. 40 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుంటే అది అరేంజ్డ్ మ్యారేజ్ ఎలా అవుతుంది? ఖచ్చితంగా మాది లవ్ మ్యారేజ్ అని చెప్పింది. అలాగే మొదట ప్రపోజ్ చేసింది తన భర్తేనని కూడా చెప్పి తన లవ్ స్టోరీని గుర్తు చేసుకుంది. ఇక నటుల జీవితంపై కూడా వరలక్ష్మి ఓ ఆసక్తికర వ్యాఖ్య చేసింది. 'యాక్టర్లు ఏమైనా కొత్తగా సృష్టించబడ్డ వాళ్లా? మేము కూడా సాధారణ మనుషులమే. సాధారణ ప్రజలు ఎలా జీవిస్తారో మేమూ అలాగే జీవిస్తాం. అందులో ఎలాంటి తేడా లేదు' అని ఆమె చెప్పింది.

ఆస్తుల విషయంపై వచ్చిన వార్తల గురించి కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. 'నాకు పెద్దగా ఆస్తులు ఏమీ లేవు. ఇప్పటికీ నేను రెంటెడ్ హౌస్‌లోనే ఉంటున్నాను. నా కష్టార్జితంతో ఒక కారు కొనుక్కున్నాను. అలాగే ఒక చిన్న ఇల్లు కొనుగోలు చేశాను' అని ఆమె తెలిపింది. మీడియా కథనాల్లో చెన్నైలో కోట్ల ఆస్తులు ఉన్నట్టు వస్తున్న వార్తలపై ఆమె వ్యంగ్యంగా స్పందించింది. 'అలా కోట్ల ఆస్తులు ఉంటే నేను ఇలా ఉండేదాన్నా? నా లైఫ్ పూర్తిగా వేరేలా ఉండేది కదా'అంటూ సెటైర్ వేసింది.

ఇక రాజకీయాల గురించి అడిగిన ప్రశ్నకు కూడా వరలక్ష్మి ఆసక్తికర సమాధానం ఇచ్చింది. 'నాకు రాజకీయాలంటే చాలా ఇష్టం. ఒక రోజు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాను. అయితే ఈ రోజుల్లో చాలామంది రాజకీయాలను వేరే కోణంలో చూస్తున్నారు. కానీ యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది'అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాదు, ప్రస్తుతం రాజకీయాల్లో వయసు మీద పడిన నాయకులు ఎక్కువగా ఉన్నారని ఆమె వ్యాఖ్యానించింది.

'డెబ్బై ఏళ్ల వయసు ఉన్న వారు రాజకీయాలు చేస్తే, యువత ఎదుర్కొంటున్న సమస్యలు వారికి పూర్తిగా అర్థమవుతాయా? అందుకే ఆ గ్యాప్‌ను ఫిల్ చేయడానికి యువ నాయకులు రావాలి’ అని వరలక్ష్మి పేర్కొంది. తమిళనాడు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా రాజకీయాల్లోకి రావడానికి తనకు ఆసక్తి ఉందని ఆమె చెప్పింది. 'అవసరం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి కూడా రావచ్చు’" అంటూ వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X