వరలక్ష్మీ శరత్ కుమార్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. ముందే కథ రివీల్ చేసిన హీరోయిన్!
వరలక్ష్మీ శరత్ కుమార్.. సినీ ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2012లో పోడా పోడి తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగు, మలయాళ, కన్నడ బాషల్లో కూడా నటించి మెప్పించింది. అద్భుతమైన సినిమాలు చేస్తూ అందరినీ తెగ అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో క్రేజీ సినిమా చేసింది. ముఖ్యంగా సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన శబరి సినిమా కథను ముందే రివీల్ చేశారు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా సినిమానే శబరి. ఈ సినిమాకు అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించగా.. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను మే 3వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమా కథ చాలా అద్భుతంగా ఉండబోతుందని... షాకింగ్ కామెంట్లు చేశారు హీరోయిన్. ముఖ్యంగా ఈ సినిమా కథ ఏంటో విడుదలకు ముందే చెప్పేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకటరమణ, శశాంక్ సిద్దంశెట్టి, మైమ్ గోపి, రాజశ్రీ నాయర్, మధుసూధన్, భద్రం, ఆశ్రిత వేముగంటి, కృష్ణ తేజ, బాబీ నివేశ, కేశవ్ దీపక్, రాజశేఖర్ అనింగి, అర్చన్ అనంత్, ప్రమోదిని, సునైనా బాదం, జెమిని సురేష్, హర్షిణి కోడూరు, మీనా కుమారిలు ప్రధాన పాత్రల్లో నకనిపించబోతున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే చాలా బాగుండబోతుందని, కథ చాలా వేగంగా ముందుకు సాగుతుందని హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పారు. సినిమా ప్రారంభం అయిన వెంటనే కథలోకి వెళ్తారని వివరించారు.

అయితే సినిమాలో ల్యాగ్ ఉండదు, అసలే లెంత్ లేదని.. ఇదొక క్లియర్ కట్ స్ట్రెయిట్ థ్రిల్లర్ సినిమా అని వరలక్ష్మీ శరత్ కుమార్ వివరించింది. అలాగే ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని... ప్రేక్షకులను సీట్ల మీదనుంచి లేవకుండా చేస్తుందీ చిత్రం అని చెప్పుకొచ్చింది. అలాగే తాను సహజంగా నెగటివ్ క్యారెక్టర్లు చేశానని.. కానీ ఈ సినిమాలోని పాత్ర మాత్రం మరింత భిన్నంగా ఉంటుందని స్పష్టం చేసింది. తన బిడ్డను కాపాడుకోవడానికి తల్లి చేసే పాత్రలో చాలా కొత్తగా కనిపించబోతున్నానని వివరించింది.

ఈ సూపర్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా మే 3వ తేదీన విడుదల కాబోతుండగా.. అంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో రాబోతున్న ఈ సినిమాను మీరు కూడా ఓసారి చూసేయండి. ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.


Click it and Unblock the Notifications











