ఆమె నా తల్లి కాదు.. ఆ సీక్రెట్లు లీక్ చేసి చాలా సార్లు ఇబ్బంది పెట్టింది: వరలక్ష్మీ షాకింగ్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో యాక్టింగ్ కెరీర్‌ను ఆరంభించిన వాళ్లు చాలా మందే ఉన్నారు. వారిలో కొందరు మాత్రమే సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతున్నారు. అలాంటి వారి జాబితాలో కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ఒకరు. మగవాళ్లకు ధీటైన పాత్రలు పోషిస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తోందీ భామ. ఇటీవల వచ్చిన రవితేజ చిత్ర 'క్రాక్'లో జయమ్మ పాత్రలో భయపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా సవితి తల్లి రాధికపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Ravi Teja High Voltage Speech At Krack Event | Filmibeat Telugu
అలా మొదలైన కెరీర్.. అన్ని భాషల్లోనూ

అలా మొదలైన కెరీర్.. అన్ని భాషల్లోనూ

తమిళ పరిశ్రమకు చెందిన సీనియర్ హీరో శరత్ కుమార్ మొదటి భార్య కూతురే వరలక్ష్మీ. నటన మీద ఉన్న ఆసక్తితో చదువు పూర్తయిన వెంటనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిందామె. 'పోడా పొడి' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ భామ.. ఆ తర్వాత ఏకంగా కన్నడ సినిమాల్లోనే ఛాన్స్ పట్టేసింది. అప్పటి నుంచి దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటించి మెప్పిస్తోంది.

PICS: Indian Couples Viral Photoshoot Photos

మలుపు తిప్పిన చిత్రాలు.. లేడీ విలన్‌గా

మలుపు తిప్పిన చిత్రాలు.. లేడీ విలన్‌గా

కెరీర్ ఆరంభంలోనే విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్. అన్ని భాషల్లోనూ అదే తరహా నటనతో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా 'విక్రమ్ వేదా', 'విష్మయ', 'మానిక్యా', 'కసాబా' వంటి చిత్రాల్లో అద్భుతమైన నటనను కనబరిచింది. ఇక, 'పందెం కోడి 2', 'సర్కార్' వంటి చిత్రాల్లో లేడీ విలన్‌గానూ కనిపించి అదరగొట్టేసిందీ తమిళ భామ.

తెలుగులోకి ఎంట్రీ.. భయపెట్టిన జయమ్మ

తెలుగులోకి ఎంట్రీ.. భయపెట్టిన జయమ్మ

సందీప్ కిషన్ నటించిన 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఈ సినిమా మంచిగా నటించిన గుర్తింపును మాత్రం అందుకోలేకపోయింది. అయితే, ఇటీవల వచ్చిన రవితేజ చిత్రం 'క్రాక్'లో ఆమె పోషించిన జయమ్మ అనే పాత్ర మాత్రం ఆకట్టుకుంది. ఈ రోల్‌లో భయపెట్టిన ఆమె.. ప్రశంసలు అందుకుంటోంది.

విశాల్‌తో ప్రేమాయణం.. మధ్యలోనే బ్రేకప్

విశాల్‌తో ప్రేమాయణం.. మధ్యలోనే బ్రేకప్

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే వరలక్ష్మీ శరత్ కుమార్.. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌తో ప్రేమాయణం సాగించింది. చాలా కాలం పాటు రహస్యంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీళ్లిద్దరూ.. ఆ తర్వాత బహిరంగంగానే ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ, అనూహ్యంగా తమ బంధానికి మధ్యలోనే పుల్‌స్టాప్ పెట్టారు.

సవతి తల్లిపై వరలక్ష్మీ షాకింగ్ కామెంట్స్

సవతి తల్లిపై వరలక్ష్మీ షాకింగ్ కామెంట్స్

'క్రాక్' మూవీ సక్సెస్ మీట్ కోసం హైదరాబాద్ వచ్చింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెను ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో తన వ్యక్తిగత, వృత్తి పరమైన ఎన్నో విషయాలను బయట పెట్టింది. అలాగే, తన కుటుంబానికి సంబంధించిన విషయాలను కూడా పంచుకుంది. ఈ క్రమంలోనే సవతి తల్లి రాధికపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆ సీక్రెట్లు అన్నీ లీక్ చేసి ఇబ్బంది పెట్టింది

ఆ సీక్రెట్లు అన్నీ లీక్ చేసి ఇబ్బంది పెట్టింది

రాధిక గురించి చెబుతూ.. 'ఆమె నా తల్లి కాదు. కానీ, నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అలాగే కెరీర్‌కు సంబంధించిన ఎన్నో సూచనలు ఇస్తుంటుంది. నేనెప్పుడైనా ఏదైనా సీక్రెట్ ఆమెకు చెబితే.. దాన్ని వెంటనే లీక్ చేసేస్తుంది. అలా నన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టింది. అయితే, అది ఆమె కావాలని చేయదు. పొరపాటున జరిగిపోతుంది' అని వివరించింది వరలక్ష్మీ శరత్ కుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X