ఆమె నా తల్లి కాదు.. చాలా సార్లు ఇబ్బంది పెట్టింది: రాధికపై వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్

సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీల నుంచి చాలా మందే అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే నేషనల్ వైడ్‌గా క్రేజ్‌ను తెచ్చుకున్నారు. వారిలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు.

అందంతో పాటు అదిరిపోయే నటనతో ఆకట్టుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో ఇటీవలే ఎంగేజ్‌మెంట్ చేసుకుని సర్‌ప్రైజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. తన సవతి తల్లి రాధికపై వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలను మీరే చూడండి!

Varalaxmi Sarathkumar Shocking Comments on Step Mother Raadhika

అలా వచ్చి బిగ్ స్టార్‌గానే: సీనియర్ హీరో హీరో శరత్ కుమార్ కూతురుగా వరలక్ష్మీ ప్రపంచానికి పరిచయం అయింది. అలాగే, 'పోడా పొడి' అనే సినిమాతో ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడంలో సహా ఎన్నో భాషల్లో నటించి ఫేమస్ అయింది. దీనికితోడు హీరో విశాల్‌తో ప్రేమాయణం సాగించడం.. తర్వాత బ్రేకప్ చెప్పడంతో సౌతిండియా మొత్తం ఆమె పేరు మారుమ్రోగి స్టార్‌గా మారింది.

Varalaxmi Sarathkumar Shocking Comments on Step Mother Raadhika

అలాంటి రోల్స్‌.. హైలైట్: విలక్షణ నటనతో వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంతో మంది అభిమానాన్ని అందుకుంది. అన్ని భాషల్లోనూ అదే తరహా నటనతో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా 'విక్రమ్ వేదా', 'విష్మయ', 'మానిక్యా', 'కసాబా' వంటి చిత్రాల్లో రెచ్చిపోయి నటించింది. ఇక, 'పందెం కోడి 2', 'సర్కార్' వంటి చిత్రాల్లో లేడీ విలన్‌గానూ కనిపించి తనలోని మరో యాంగిల్‌తో రచ్చ చేసింది.

Varalaxmi Sarathkumar Shocking Comments on Step Mother Raadhika

తెలుగులో సూపర్ హిట్: 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' సినిమా ద్వారా వరలక్ష్మీ శరత్ కుమార్ టాలీవుడ్‌లోకి వచ్చింది. దీని తర్వాత 'క్రాక్'లో ఆమె పోషించిన జయమ్మ అనే పాత్రతో రచ్చ చేసింది. అనంతరం ఈ అమ్మడు తెలుగులో 'నాంది', 'యశోద' వంటి చిత్రాల్లో నటించి హిట్లను సాధించింది. గత ఏడాదిలో 'వీర సింహా రెడ్డి', 'హనుమాన్'తో భారీ విజయాలను సొంతం చేసుకుంది.

Varalaxmi Sarathkumar Shocking Comments on Step Mother Raadhika

ఫుల్ బిజీ.. నిశ్చితార్థంతో: వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు తెలుగులో 'శబరి' అనే సినిమాను చేస్తోంది. అలాగే, మలయాళంలో 'కలర్స్', తమిళంలో 'రాయన్' వంటి చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ఇలా కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే వరలక్ష్మి ఇటీవలే నికోలయ్ సచ్‌దేవ్ అనే ఆర్ట్ గ్యాలరీ ఓనర్‌తో నిశ్చితార్థం చేసుకుని సర్‌ప్రైజ్ చేసింది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది.

Varalaxmi Sarathkumar Shocking Comments on Step Mother Raadhika

ఆమెతో ప్రత్యేక బంధం: వరలక్ష్మి.. శరత్‌ కుమార్ - చాయా దంపతులకు జన్మించిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఆమె తండ్రి సీనియర్ హీరోయిన్ రాధికను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి సవతి తల్లితో వరలక్ష్మి సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉంది. రాధికలో నిజమైన తల్లిని చూసుకుంటూ ప్రత్యేక బంధాన్ని ఏర్పరచుకుంది. అందుకే వీళ్లు కలిసిమెలిసి ఉండగలుగుతున్నారు.

రాధిక నా తల్లి కాదని: సెన్సేషనల్ యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్ కుమార్‌ను ఇటీవలే న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో తన వ్యక్తిగత, వృత్తి పరమైన ఎన్నో విషయాలను బయట పెట్టింది. అలాగే, తన కుటుంబానికి సంబంధించిన విషయాలను కూడా పంచుకుంది. ఈ క్రమంలోనే సవతి తల్లి రాధికపై వరలక్ష్మి శరత్‌కుమార్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

Varalaxmi Sarathkumar Shocking Comments on Step Mother Raadhika

చాలా ఇబ్బంది పెట్టింది: తాజా ఇంటర్వ్యూలో వరలక్ష్మి 'రాధిక నా తల్లి కాదు. కానీ, నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అలాగే కెరీర్‌కు సంబంధించి ఎన్నో సూచనలు ఇస్తుంటుంది. కానీ, ఏదైనా సీక్రెట్ ఆమెకు చెబితే.. దాన్ని వెంటనే లీక్ చేసేస్తుంది. అలా నన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టింది. అయితే, అది ఆమె కావాలని చేయదు. పొరపాటున జరిగిపోతుంది' అంటూ వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X