'జనాభాలో మనమే ఫస్ట్.. కానీ శృంగారం మాటెత్తితే పాపంగా చూస్తాం'

దక్షిణాదిలో సంచలన నటిగా ముద్రవేసుకున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar). ఎలాంటి పాత్రనైనా, ఏ భాషలోనైనా నటించి సత్తా చాటగలిగిన నటి ఈ భామ. నటుడు శరత్‌కుమార్‌ వారసురాలైన వరలక్ష్మి తొలి సారి ఆమె మెగా ఫోన్ ప‌ట్టింది. ఇటీవల ఎస్. సరస్వతి ( S Saraswathi) సినిమాతో నిర్మాత‌గా మారింది వరలక్ష్మి. తాజాగా థియేటర్లలో విడుదలైన 'ఎస్ సరస్వతి' సినిమా సక్సెస్ పుల్ గా రన్ అవుతోంది. ఇదిలా ఉంటే.. హీరోయిన్ వరలక్ష్మి ఏ విషయాన్ని నిర్మోహమాటంగా మాట్లాడేస్తుంది. అలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరలక్ష్మి పిల్లలను కనడం, కుటుంబ బాధ్యతలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నారంటే?

ఇటీవల హీరోయిన్ వరలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోయినా సరైన ప్రణాళిక లేకుండా పిల్లలను కనడం సరైన నిర్ణయం కాదని అన్నారు. 'మన దేశంలో సెక్స్ గురించి మాట్లాడటానికి చాలా మంది ఇష్టపడరు. కానీ జనాభాలో మాత్రం మనం ప్రపంచంలో ముందున్నాం. అంటే అందరూ ఆ పని చేస్తున్నారు, కానీ, కానీ శృంగారం మాటెత్తితే పాపంగా చూస్తాం. దాని గురించి మాట్లాడటానికి మాత్రం ఇష్టపడరు. అది నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది' అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు, చాలామంది పిల్లలను కనడం విషయంలో సరైన ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్తున్నారని ఆమె విమర్శించారు.

Varalaxmi Sarathkumar s Bold Comments on Population and Financial Planning for Children

'కొంతమంది పిల్లలను ఫ్యాక్టరీలా కనేస్తుంటారు. తర్వాత జీవితంలో ఇబ్బందులు ఎదురైతే పరిస్థితులు కష్టంగా ఉన్నాయని అంటారు. కానీ ముందుగా ఆలోచించకుండా పిల్లలను ఎందుకు కనాలి? ముందుగా ప్లాన్ చేసుకోవాలి" అని ఆమె అన్నారు.అయితే తాను పిల్లలను కనడాన్ని వ్యతిరేక కాదని వరలక్ష్మి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జీవన వ్యయం చాలా పెరిగిపోయిందని, ఒక పిల్లవాడిని పెంచడం అంటే డబ్బు, సమయం, బాధ్యత అన్నీ అవసరమని చెప్పారు. 'పిల్లలు వద్దని కాదు. కానీ ఆర్థికంగా స్థిరంగా ఉన్న తర్వాత మాత్రమే పిల్లలను కనాలని నేను భావిస్తాను'అని ఆమె వివరించారు.

ఇంకా కొంతమంది తమ పిల్లల కోసం ఆర్థిక సహాయం కోరుతూ తన దగ్గరకు వస్తారని కూడా ఆమె వెల్లడించారు. "మీరు పిల్లలను కనేసి తర్వాత నన్ను సహాయం చేయమని అడుగుతారు. నేను ఆ పిల్లలను కనానా? మీరు చేసిన నిర్ణయానికి మీరు బాధ్యత వహించాలి. మీ పిల్లల బాధ్యతను మీరే తీసుకోవాలి" అంటూ ఆమె ఘాటు చేశారు. ప్రస్తుతం వరలక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె చేసిన వ్యాఖ్యలు సరేనని మద్దతు ఇస్తుండగా, మరికొందరు మాత్రం ఈ వ్యాఖ్యలపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నటి వరలక్ష్మి చర్చనీయంగా మారాయి.

ఇదిలా ఉంటే.. వరలక్ష్మి శరత్‌కుమార్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సరస్వతి' (Saraswathi). ఈ సినిమాలో ప్రకాశ్‌ రాజ్‌, ప్రియమణి కీలకపాత్రల్లో నటించారు. తమన్‌ సంగీతం అందించగా.. వరలక్ష్మితోపాటు పూజా శరత్‌కుమార్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇందులో ప్రకాశ్‌రాజ్‌ లాయర్‌గా కనిపించారు. ఒక అమ్మాయి మిస్సింగ్‌ సోర్టీ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. మార్చి 6 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో ధియేటర్స్ రన్ అవుతోంది. అయితే.. ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి, దర్శకురాలిగా కూడా ప్రేక్షకులను మెప్పించగలిగిందనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X