twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విశాల్‌ను పట్టించుకోని వరలక్ష్మి... ఫ్యాన్స్ అరుపులు, ఆ ఇద్దరి రొమాన్స్ గురించి!

    |

    విశాల్‌ హీరోగా ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'పందెంకోడి 2'. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించగా.... వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ పాత్ర పోషించారు. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ పంక్షన్ నిర్వహించారు.

    ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతుండగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందరి గురించి మాట్లాడిన వరలక్ష్మి.... విశాల్ గురించి మాట్లాడలేదు. దీంతో అభిమానులు అరవడం మొదలు పెట్టడంతో ఆమె రియాక్ట్ అయ్యారు. విశాల్-వరలక్ష్మి మధ్య ప్రేమించుకున్నారని, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సంఘటన ఆసక్తికరంగా మారింది.

    విశాల్ నా ఫ్రెండ్, అందుకే...

    విశాల్ నా ఫ్రెండ్, అందుకే...

    విశాల్ గురించి మాట్లాడటం లేదేమంటూ అభిమానులు అరవడంతో వరలక్ష్మి సారీ చెప్పారు. ఆయన నా ఫ్రెండ్ కాబట్టి పక్కన నిల్చున్నా నేను మరిచిపోయాను. ఫెంటాస్టిక్ యాక్టర్, గ్రేట్ ప్రొడ్యూసర్ అంటూ పొగడ్తలు గుప్పించారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు విశాల్‌కు థాంక్స్ చెప్పారు.

    Recommended Video

    Pandem Kodi 2 Movie Pre Release Event
    ఆ ఇద్దరి మద్దరి మధ్య రొమాన్స్ గురించి

    ఆ ఇద్దరి మద్దరి మధ్య రొమాన్స్ గురించి

    ‘పందెంకోడి 2'లో కీర్తి సురేష్ చాలా బాగా నటించింది. ముఖ్యంగా విశాల్-కీర్తి మధ్య వచ్చే సన్నివేశాలు బావుంటాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బావుంది అంటూ అంటూ వరలక్ష్మి ప్రశంసల వర్షం కురిపించారు.

    భవానీ అనే పాత్రలో

    భవానీ అనే పాత్రలో

    ఈ చిత్రంలో తాను భవాని అనే క్యారెక్టర్‌ చేశాను. ఈ పాత్ర తనకు ఇచ్చిన లింగుస్వామిగారికి థాంక్స్‌. సినిమాటోగ్రాఫర్ శక్తి అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు. తెలుగులో సినిమాను విడుదల చేస్తున్న ఠాగూర్‌ మధుగారికి థాంక్స్‌ అని వరలక్ష్మి వ్యాఖ్యానించారు.

     పందెకోడి 2

    పందెకోడి 2

    విశాల్‌, లింగుస్వామి కలయికలో 13 సంవత్సరాల క్రితం వచ్చిన 'పందెంకోడి' విశాల్‌ కెరీర్‌లోనే బిగెస్ట్‌ హిట్‌గా నిలిచింది. మళ్ళీ విశాల్‌, లింగుస్వామి కాంబినేషన్‌లో వస్తోన్న 'పందెంకోడి 2' చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. 'పందెం కోడి 2' మాస్‌ హీరో విశాల్‌కి 25వ సినిమా కావడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కి, ట్రైలర్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వచ్చింది. లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతి లాల్‌ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు.

    English summary
    Varalaxmi Speech At Pandem Kodi 2 Pre Release Event. Pandem Kodi 2 film written and directed by N. Linguswamy. A sequel to the successful Pandem Kodi (2005), the film features Vishal for his 25th film in a dual role as Father & Son with Keerthy Suresh and Rajkiran in the lead roles. Varalaxmi Sarathkumar and Soori in other pivotal roles. The film confirmed to be released in October 2018.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X