Varanasi: వారణాసి బడ్జెట్‌ పెరిగిందా?.. ప్రియాంక చోప్రా క్లారిటీ..!

Varanasi: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (S.S. Rajamouli)- సూపర్‌స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ అడ్వెంచరస్ పాన్ వరల్డ్ మూవీ వారణాసి (Varanasi)పై అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి చేపట్టిన ప్రాజెక్ట్ కావడంతో పాటు, మహేశ్‌బాబు కెరీర్‌లో 29వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమా ఇండియన్ ఫిల్మీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 2027 మార్చిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ బడ్జెట్ పై రూమార్స్ వస్తున్నాయి. ఈ రూమర్స్ పై బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా స్పందించారు.

శ్రీ దుర్గా ఆర్ట్స్, షోవింగ్ బిజినెస్ బ్యానర్స్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తీకేయ,ఎస్ గోపాల్ రెడ్డిలు సంయుక్తంగా వారణాసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. భారతీయ సినిమా పరిశ్రమలోనే తొలిసారిగా 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ మూవీగా వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్నారట.

Varanasi Budget Rumours Priyanka Chopra Reacts to 1300 Cr Talk on Rajamouli-Mahesh Babu Film

ఇక రాజమౌళి సినిమా అంటేనే భారీ స్కేల్, భారీ బిజినెస్. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో వందల కోట్ల బడ్జెట్‌లకు కొత్త నిర్వచనం ఇచ్చిన జక్కన్న, 'వారణాసి'తో ఆ స్థాయిని మరో మెట్టు ఎక్కించబోతున్నారని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ బడ్జెట్ రూ.1200 కోట్లకు పైగా ఉంటుందనే ప్రచారం జరుగుతుండగా, తాజాగా అది రూ.1300 కోట్లకు చేరిందన్న రూమర్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra)ఈ విషయంపై స్పందించడం వైరల్‌గా మారింది.

ఇటీవల ప్రియాంక చోప్రా .. కపిల్ శర్మ షో (The Kapil Sharma Show)కు హాజరయ్యారు. ఈసమయంలో ప్రియాంక చోప్రాను కపిల్ శర్మ సరదాగా ప్రశ్నించారు. 'వారణాసి మూవీ బడ్జెట్ రూ.1300 కోట్లు అని విన్నాం. మీరు ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయిన తర్వాత అది డబుల్ అయిందట.. నిజమేనా?" అని అడగగా, ప్రియాంక నవ్వుతూ, 'అంటే బడ్జెట్‌లో సగం డబ్బులు నా అకౌంట్‌లోకి వచ్చాయని చెబుతున్నారా?' అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చింది. ఈ వ్యాఖ్యలతో స్టూడియో మొత్తం నవ్వుల పూవ్వులు పూశాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, బడ్జెట్ రూమర్లకు సరదా టచ్‌తో చెక్ పెట్టినట్లయింది.

తన సినిమాను ఎలా మార్కెట్ చేయాలో రాజమౌళికి తెలిసినంతగా మరెవరికీ తెలియదని మరోసారి రుజువైంది. మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ పాత్రల్ని పరిచయం చేస్తూ విడుదల చేసిన క్యారెక్టర్ పోస్టర్లు భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన 'గ్లోబ్ ట్రాట్టర్' ఈవెంట్‌తో దేశీయంగా మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా 'వారణాసి'పై ఆసక్తిని పెంచారు. ముఖ్యంగా ఎద్దుపై ఎంట్రీ ఇస్తున్న మహేశ్‌బాబు లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

'వారణాసి' బడ్జెట్‌పై ఎన్ని రూమర్లు వచ్చినా, మేకర్స్ మాత్రం అధికారికంగా ఎలాంటి సంఖ్యలను ప్రకటించలేదు. ప్రియాంక చోప్రా సరదా సమాధానం ఈ చర్చలకు కాస్త లైట్ టచ్ ఇచ్చినా, సినిమా స్కేల్ మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లనుందన్నది ఖాయం. రాజమౌళి-మహేశ్‌బాబు కాంబోలో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచరస్ విజువల్ వండర్ 2027లో బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X