నిక్‌తో అలాంటి విభేదాలు నిజమే.. విడాకుల వార్తలపై ప్రియాంక చోప్రా
దేశీ గర్ల్ నుంచి గ్లోబల్ స్టార్ వరకు ఎదిగిన అందాల భామ ప్రియాంక చోప్రా సుదీర్ఘమైన కెరీర్‌ను కొనసాగిస్తూ భారీ ప్రాజెక్టుల్లో భాగమవుతున్నారు. తాజాగా ఆమె ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వారణాసి మూవీలో కీలక పాత్రను పోషిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఆమె అభిమానులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకా పలు క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నారు. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ దూసుకెళ్తున్న ఈ గ్లామర్ క్వీన్ ఇటీవల ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో అనేక అనుమానాలను, రూమర్లను క్లియర్ చేసేందుకు ప్రయత్నించింది. ఆమె చెప్పిన ఆసక్తికరమైన విషయాల్లోకి వెళితే..
ఆస్కార్ అవార్డుల పార్టీలో నిక్‌తో పరిచయం జరిగింది. ఆ పరిచయం మా మధ్య స్నేహంగా మారింది. అనంతరం మా ఇద్దరి అభిరుచులు కలవడంతో ప్రేమగా మారింది. కొనాళ్లు ట్రావెల్ చేసిన తర్వాత మేమిద్దరం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నాం. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో 2018 లో వివాహం చేసుకొన్నాం. ప్రస్తుతం మాకు మల్టీ మారీ అనే కూతురు ఉందనే విషయం తెలిసిందే అని ప్రియాంక చోప్రా తన గురించి చెప్పుకొచ్చారు.

మా ఇరు కుటుంబాల మధ్య కల్చరల్ అంతరాలు ఉన్నాయనేది సహజం. నాది భారతీయ సంప్రదాయ కుటుంబం. నిక్‌ది అమెరికన్ ఫ్యామిలీ. కాబట్టి వాళ్ల కట్టుబాట్లు, సంప్రదాయాలు, సంస్కృతి పూర్తిగా విభిన్నంగా ఉండేవి. వాళ్ల మాట తీరు, ప్రవర్తన అన్నీ వేరుగా ఉండేవి. ఆరంభంలో అవన్నీ నాకు ఇబ్బందిగా అనిపించేవి. కానీ ఆ కుటుంబ పద్దతులు, అలవాట్లను అనుసరించడం వల్ల కొన్ని సమస్యలు తొలిగిపోయాయి అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు.
నిక్ జోనస్ కుటుంబంలో ప్రతీ ఒక్కరు చాలా నెమ్మదిగా మాట్లాడేవారు. చాలా క్రమశిక్షణతో ఉండేవారు. మన మాదిరిగా వేగంగా మాట్లాడే తీరు కాదు. ఆరంభంలో వారు మాట్లాడేటప్పుడు నేను మధ్యలో దూరి జోక్యం చేసుకొనేదానిని. కానీ ఆ తర్వాత తెలిసిందేమిటంటే.. ఎదుటి వాళ్లు పూర్తిగా మాట్లాడేటప్పుడు వినాలి. ఆ తర్వాత ఎదుటి వాళ్లు, నిక్ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడటం పూర్తయ్యే వరకు విని వారికి సమాధానం చెప్పే దానిని అని ప్రియాంక చోప్రా తెలిపారు.
అయితే ప్రతీ దాంపత్య జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి. సెలబ్రిటీ అయినా.. కామన్ మ్యాన్ అయినా బ్యాలెన్స్ అనేది తప్పనిసరి. కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్న సమయంలో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. వాటిని అధిగమిస్తూ జీవితాన్ని ముందుకు తీసుకుపోవాలి. నిక్‌తో కల్చరల్ పరంగా కొన్ని విభేదాలు ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో మేము విడిపోతున్నట్టు రూమర్లు వచ్చాయి. డైవోర్స్ వార్తల్లో నిజం లేదు అని ప్రియాంక చోప్రా చెప్పారు.


Click it and Unblock the Notifications











