పుట్టినరోజున హీరోయిన్‌కు షాకింగ్ న్యూస్.. ఈవిడను కూడా లేపేస్తారా?

సౌత్ స్టార్ విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న 'వర్మ' చిత్రం విడుదల మరికొన్ని నెలలు ఆలస్యం కాబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయినప్పటికీ ఫైనల్ ఔట్‌పుట్ మీద అసంతృప్తిగా ఉన్న నిర్మాణ సంస్థ 'ఇ4 ఎంటర్టెన్మెంట్స్'.. మొత్తం చిత్రాన్ని రీ షూట్ చేయాలని నిర్ణయించింది.

బాల దర్శకత్వంలో 'వర్మ' రూపొందిన సంగతి తెలిసిందే. అయితే అతడు తెరకెక్కించిన విధానం నిర్మాతలకు నచ్చలేదట. దీంతో కొత్త దర్శకుడితో, కొత్త టెక్నీషియన్లతో టోటల్ మూవీ రీ షూట్ చేయాలని డిసైడ్ అయ్యారు. తెలుగులో విజయ్ దేవరకొండ-శాలిని పాండే జంటగా రూపొందిన 'అర్జున్ రెడ్డి' ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే.

విషయం తెలిసి షాకైన హీరోయిన్

విషయం తెలిసి షాకైన హీరోయిన్

‘వర్మ' సినిమాలో ధృవ్‌కు జోడీగా కొత్త హీరోయిన్ మేగా చౌదరి నటిస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో జరుగుతున్న గంధరగోళం తనకు తెలియదని, ఈ న్యూస్ విని తాను షాకైనట్లు ఆమె మీడియాకు వెల్లడించారు.

ఈవిడను కూడా లేపేస్తారా?

ఈవిడను కూడా లేపేస్తారా?

ఫిబ్రవరి 7న ‘వర్మ' సినిమా గురించి ఈ షాకింగ్ న్యూస్ వెల్లడిస్తూ ‘ఇ4 ఎంటర్టెన్మెంట్ష్' సంస్థ అఫీషియల్ నోట్ విడుదల చేసింది. ఇదే రోజు మేఘ చౌదరి పెట్టినరోజు కావడం గమనార్హం. దర్శకుడితో పాటు నటీనటులను, టెక్నీషియన్లు సైతం మారుస్తానని తమ ప్రెస్ నోట్లో పేర్కొనడంతో మేఘ చౌదరి రీ షూట్లో ఉంటుందా? ఊడుతుందా? అనేది ఉత్కంఠగా మారింది.

త్వరలో వారితో మాట్లాడతా

త్వరలో వారితో మాట్లాడతా

సినిమా రీ షూట్ గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే ఈ విషయమై చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధులతో మాట్లాడతాను అని మేఘ చౌదరి మీడియా వెల్లడించారు.

ఇంత పెద్ద నిర్ణయం వెనక...

ఇంత పెద్ద నిర్ణయం వెనక...

‘అర్జున్ రెడ్డి' స్థాయిని అందుకునేలా ‘వర్మ' లేక పోవడంతో పాటు... విక్రమ్ కుమారుడు ‘ధృవ్' హీరోగా పరిచయం అవుతున్న చిత్రం కావడం, ఏదైనా తేడా వస్తే అతడి సినిమా భవిష్యత్తు మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనే కారణంతో డబ్బు ఖర్చయినా పర్వాలేదు రీ షూట్ చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X