పెళ్లి జోష్‌లో యాంకర్ వర్షిణి.. అనుమానం రేకెత్తించిన ఇన్స్‌టాగ్రామ్‌ పోస్టు..జోరుగా రూమర్లు!

యాంకర్ వర్షిణికి ప్రత్యేకంగా ఇంట్రోడక్షన్ అవసరం లేదు. వెబ్ సిరీస్, వెండితెర, బుల్లితెర ఇలా ఎక్కడైనా సరే ఆమె తన మార్క్ చూపిస్తుంది. పెళ్లి గోలతో అభిజిత్‌తో కలిసి వర్షిణి అదరగొట్టేసింది. ఇక ఢీ షోలో తన డ్యాన్సులు, కామెడీతో అందరినీ నవ్వించేసింది. సినిమాల్లోనూ మంచి పాత్రలను పోషిస్తూ మరింతగా ఫేమస్ అవుతోంది. ఇప్పుడు ఆమెకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తుండటంతో.. బుల్లితెరకు దూరంగా ఉంటోంది. ఇక ఇప్పుడు పెళ్లి సందడిలో బిజీగా ఉంది.

ఢీ షోతో ఫేమస్..

ఢీ షోతో ఫేమస్..

పెళ్లి గోల వెబ్ సిరీస్‌తో వర్షిణికి మంచి ఇమేజ్ వచ్చింది. అయితే ఎక్కువగా పాపులర్ అవ్వలేదు. ఆమెకు బుల్లితెరపైనే మంచి క్రేజ్ ఏర్పడింది. ఢీ షోలోకి వచ్చాకే వర్షిణి ట్రెండ్ అవ్వడం మొదలుపెట్టేసింది. ఢీ షోలో వర్షిణి ఆది ట్రాక్ ఎంతగా వర్కవుట్ అయిందో అందరికీ తెలిసిందే. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందరిలోనూ ఎన్నో అనుమానాలు క్రియేట్ చేశారు.

ప్రేమ, పెళ్లి..

ప్రేమ, పెళ్లి..


ఆది వర్షిణి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని, వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్నారంటూ ఇలా ఎన్నెన్నో రూమర్లు వచ్చాయి. కానీ అవన్నీ ఉట్టి గాలి వార్తలేనని కొట్టిపారేస్తుంటారు ఆది వర్షిణి. తామిద్దరం మంచి స్నేహితులమని ఎన్నో సార్లు క్లారిటీగా చెప్పుకొచ్చారు.

ఆదితో అలా..

ఆదితో అలా..


ఇక ఆది బర్త్ డే సందర్భంగా వర్షిణి చేసిన పోస్టుతో కొత్త అనుమానాలు వచ్చాయి. ఆ ఫోటోలు, వీడియోలు, అందులో ఆదితో క్లోజ్‌గా ఉన్న విధానంతో అందరిలోనూ అనుమానాలు బలంగా నాటుకున్నాయి. నువ్ ఎప్పుడూ నాతోనే ఉండాలి అంటూ వర్షిణి ఇలా ఆదిపై ప్రేమను కురిపిస్తూ బర్త్ డే విషెస్ చెప్పింది.

పలు సినిమాలతో..

పలు సినిమాలతో..

సుమంత్ హీరోగా వచ్చిన మళ్లీ మొదలైంది సినిమాలో వర్షిణి నటించింది. ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేకోయింది. ఇక సమంత శాకుంతలం రెడీగా ఉంది. ఈ మధ్యే శివ కందుకూరి హీరోగా భూతద్దం భాస్కర్ నారాయణ అనే సినిమాలో వర్షిణికి ఓ రోల్ ఆఫర్ చేశారు.

Recommended Video

NASA అంతరిక్షంలోకి Athira Preeta Rani... ఎవరీమె? *Trending | Telugu OneIndia

ముంబై పెళ్లిలో..

ముంబైలో తన ఫ్యామిలీకి సంబంధించిన వారి పెళ్లి జరుగుతోందని,అక్కడ ఇలా ఎంజాయ్ చేస్తున్నాను అని వర్షిణి చెప్పింది. ఇక వర్షిణి లంగావోణిలో కనిపించిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. నీ పెళ్లి ఎప్పుడు అని వర్షిణిని నెటిజన్లు అడుగుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X