Bhanu Shree Mehra: బికినీలో అల్లు అర్జున్ హీరోయిన్ అందాలు.. కుర్రకారుకు కిర్రాక్ పుట్టించేలా!
Varudu Movie Heroine: భాను శ్రీ మెహ్రా.. ఈ పేరు చెబితే తెలుగు సినీ ప్రేక్షకులు ఎవరూ పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు. కానీ వరుడు సినిమాలో అల్లు అర్జున్ పక్కన నటించిన అమ్మాయి అంటే మాత్రం అంతా ఇట్టే గుర్తు పట్టేస్తారు. వరుడు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎక్కడా అంతగా కనిపించలేదు. ఆ సినిమా ఫెయిల్ అవ్వడం, ఆ తర్వాత కూడా ఈ అమ్మడుకు అంతగా అవకాశాలు రాకపోవడంతో తెలుగు ప్రేక్షకులు అందరూ ఈమెని మర్చిపోయారు. అడపాదడపా చిన్న చిన్న సినిమాల్లో కనిపిస్తున్నా.. అవి ఎక్కువగా ఎవరికీ తెలియకపోవడంతో ఆమె గురించి పట్టించుకోవడమే మానేశారు.
అలా ఎలా అనే సినిమాలో వెన్నెల కిషోర్ కు జోడీగా నటించిన ఈ ముద్దుగుమ్మ.. రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలే, శర్వానంద్ రన్, కీర్తి సురేష్ మిస్ ఇండియా, అల్లరి నరేష్ బ్రదర్ ఆఫ్ బొమ్మాళి వంటి చిత్రాల్లో క్యారెక్టర్ రోల్ లో కనిపించింది. కానీ హీరోయిన్ గా మాత్రం ఆమె రాణించలేకపోయింది. దీంతో కేవలం పర్సనల్ కెరియర్ పైనే దృష్టి పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే సోషల్ మీడియాలో అడుగు పెట్టింది. గతంలో అంతగా నెట్టింట ఈమె కనిపించకపోయేది. కానీ ఈ మధ్య మాత్రం బాగానే రచ్చ చేస్తుంది. ఇటీవలే బిగ్ బాస్ షోగురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షోను అసలు జనాలు ఎలా చూస్తున్నారు, నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటాను అంటూ చెప్పుకొచ్చింది.

దీనికి తోడు ఎప్పుడూ కొత్త సీజన్స్ వస్తూనే ఉంటాయని.. తన దృష్టిలో ఇదో చెత్త షో అని సంచనల వ్యాఖ్యలు చేసింది భాను శ్రీ మెహ్రా. అలాగే తన ఇన్ స్టాగ్రామ్ ఫీడ్ అంతా కూడా బిగ్ బాస్ వీడియోలతో నిండిపోతుందని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయింది. ఈ ఘటనకు కొంత కాలం ముందే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేశారంటూ చెప్పి బాగా ట్రెండ్ అయింది. దీంతో బన్నీ అభిమానులు అంతా ఫుల్ ఫైర్ అయ్యారు. మరో రెండు గంటల తర్వాతనే ఆమె మరోసారి స్పందించి.. ఇప్పుడే బన్నీ తన ఖాతాను అన్ బ్లాక్ చేశాడని చెప్పింది. తన కెరియర్ విషయంలో అల్లు అర్జున్ ను తాను ఏమాత్రం తప్పు పట్టడం లేదని చెబుతూ ట్వీట్ చేసింది. ఇలా ఈ గొడవ కూడా ముగిసింది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్విట్టర్ వేదికగా తన ఫొటోలను షేర్ చేసింది. అందులో బికినీ వేసుకొని రచ్చ చేసింది క్యూట్ బ్యూటీ భాను శ్రీ మెహ్రా. ముఖ్యంగా ఆమె ఇటీవలే భాను శ్రీ వ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానెల్ పెట్టింది. ట్రావెలింగ్ వీడియోలను అందులో పోస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఫేమస్ బీచ్ ఉలువాటు బీచ్ కి వెళ్లి బికినీ వేసుకొని మరీ సందడి చేసింది. తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసేందుకు వీడియో కోసం తీసిన ఈ ఫొటోలను, లింక్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.
అయితే ఈ ఫొటోల్లో భాను శ్రీ మెహ్రా చాలా అందంగా కనిపిస్తోంది. తన ఒంపుసొంపులు అన్నీ చూపిస్తూనే బీచ్ గురించి వివరించిందీ ముద్దుగుమ్మ. దీంతో క్షణాల్లోనే ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా బికినీలో బన్నీ హీరోయిన్ అనే హ్యాష్ ట్యాగ్ తో నెట్టింట వైరల్ గా మారింది. మీరూ ఓసారి ఈమె ఫొటోలు, కుదిరితే యూట్యూబ్ ఛానెల్ కూడా చూసేసి ఆమె అందాలను ఆస్వాదించండి.


Click it and Unblock the Notifications











