Vithika Sheru: డబ్బుల కోసం 11 ఏళ్లకే ఆ పని చేశా.. వితికా షేరు షాకింగ్ కామెంట్లు!

హీరో వరుణ్ సందేశ్ భార్య, హీరోయిన్ వితికా శేరు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీలోని భీమవరంలో పుట్టిన ఈ క్యూట్ బ్యూటీ చిన్నతనంలోనే సినిమాల్లోకి వచ్చింది. బాలనటిగా అనేక సినిమాలు చేస్తూనే.. హీరోయిన్ గా కూడా మారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అయితే వరుణ్ సందేశ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత పెద్దగా సినిమాలు చేయని ఈమె యూట్యూబ్ లో మాత్రం ఓ ఛానెల్ పెట్టి తన కెరియర్ ను కొనసాగిస్తోంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ షాకింగ్ కామెంట్లు చేసింది. 11 ఏళ్లకే డబ్బుల కోసం తాను ఆ పని చేసినట్లు వివరించింది. మరి ఆ పని ఏంటి, అంత చిన్న వయసులోనే డబ్బులు సంపాదించాలని ఆమె ఎందుకు అనుకుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Varun Sandesh Wife Vithika Sheru Shocking Comments on His Cine Career Check Details

వితికా షేరు.. ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో పుట్టి పెరిగింది. అయితే తండ్రి చనిపోవడంతో.. తల్లే వితికాతో పాటు తన చెల్లెలిని కూడా పెంచింది. ఇద్దరు ఆడ పిల్లలతో పాటు ఫ్యామిలీ బాధ్యతలు మీద వేసుకున్న వితికా తల్లి రోజంతా చాలా కష్టపడేదని.. అనేక రకాల పనులు చేస్తూ తమను చక్కగా పెంచిందని చెప్పింది. కానీ తనకు పదేళ్ల వయసు వచ్చే సరికి ఇంటి ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిపోయిందని... ఇలా ఎంత చేసినా తమ కష్టాలు తీరవని డబ్బు సంపాదించాలని ఫిక్స్ అయిందట వితికా షేరు.

చిన్నప్పపటి నుంచే బాధ్యతలు, బంధుత్వాల గురించి తెలుసుకున్న వితికా షేర్.. ఏం చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చో తెలుసుకునే పనిలో పడిందట. అప్పుడే తన పక్కింటి వారు పాప బాగుందని, సీరియల్స్ లో నటించేందుకు పంపిస్తే మంచిదని చెప్పారట. దీంతో తన తల్లి వితికాను సినీ రంగంలోకి పంపిందట. అలా 11 ఏళ్ల వయసులో చక్రవాకం సీరియల్ లో ఓ క్యారెక్టర్ వచ్చిందని... కానీ షూటింగ్ జరిగిన మూడు రోజులకే అమ్మవారు సోకడంతో.. ఆ సీరియల్ కు బై చెప్పాల్సి వచ్చినట్లు వివరించింది.

Varun Sandesh Wife Vithika Sheru Shocking Comments on His Cine Career Check Details

ఆ తర్వాత కూడా అనేక సీరియల్స్, షోల కోసం తాను పని చేశానని..కానీ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో కన్నడ, తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లినట్లు వివరించింది. అలా అలా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారినట్లు వెల్లడించింది. అలా తాను సంపాదించిన డబ్బులతోనే ఇంటి పరిస్థితి పూర్తిగా మార్చినట్లు ముఖ్యంగా ఏడాది క్రితమే తన చెల్లి పెళ్లి తానే దగ్గరుండి చేసినట్లు వివరించింది. ప్రస్తుతం తన కుటుంబాన్ని, తల్లిని కూడా తానే చూసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. యూట్యూబ్ ద్వారా వీడియోలు చేస్తూ బాగానే సంపాదించుకుంటున్నానని వెల్లడించింది. ప్రస్తుతం ఫైనాన్షియల్ గా బాగా సెటిల్ అయినట్లు స్పష్టం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X