Lavanya Tripathi: నిహారిక బాటలో లావణ్య త్రిపాఠి.. నెటిజన్స్ షాక్.. ఫోటోలు వైరల్

టాలీవుడ్ అందమైన ముద్దుగుమ్మల్లో లావణ్య త్రిపాఠి ఒకరు. యూపీకి చెందిన ఈ బ్యూటి అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగులోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీలో పద్ధతిగా, ముద్దుగా, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిన్నది తర్వాత స్టార్, మీడియం రేంజ్ హీరోలతో ఆడిపాడింది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రేమయాణం సాగించిన ఈ బ్యూటి ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలో పెళ్లి కూడా చేసుకోనుంది. అయితే తాజాగా ఆమె పెట్టిన ఫొటోలతో నిహారిక బాటలో లావణ్య పయనిస్తుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సక్సెస్:నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అంటూ తన క్యూట్‌నెస్‌తో అనేక మంది అభిమానులను సంపాదించుకుంది అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. లావణ్య మొదటి సినిమా అందాల రాక్షసి మంచి హిట్ కొట్టిన తర్వాత దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి చిత్రాలతో అలరించింది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి.

Varun Tej Fiance Lavanya Tripathi Latest Gym Workout Photos Viral And Netizens Shocked

డిజాస్టర్ టాక్:ఇప్పటివరకు సొట్ట బుగ్గల సుందరి లావణ్య కెరీర్ సాఫీగానే సాగిన తర్వాత మాత్రం అంతా మారిపోయింది. ఆమె చేసిన ప్రతి సినిమా ప్లాప్ గా నిలిచి దెబ్బ మీద దెబ్బ పడినట్లు అయింది. లచ్చిందేవికి ఓ లెక్కుంది, రాధ, ఇంటలిజెంట్, యుద్ధం శరణం, మిస్టర్, అంతరిక్షం, అర్జున్ సురవరం, ఏ1 ఏక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే వంటి చిత్రాలు వరుసగా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.

Varun Tej Fiance Lavanya Tripathi Latest Gym Workout Photos Viral And Netizens Shocked

హీరోతో లవ్ ట్రాక్:సినిమాలే కాకుండా ఇటీవలే పులి మేక అనే వెబ్ సిరీసుతో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన అందాల సుందరాంగీ లావణ్య త్రిపాఠి పర్వాలేదనిపించుకుంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకుంది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రేమాయణం సాగించింది. వీళ్ల లవ్ ట్రాక్ పై ఎన్నో వార్తలు వచ్చిన రియాక్ట్ కాలేదు. కానీ వాటిని నిజం చేస్తూ జూన్ 9న నిశ్చితార్థం చేసుకున్నారు.

ఇంకాస్తా ముందుగా :త్వరలోనే మెగా కుటుంబంలోకి కోడలుగా అడుగు పెట్టబోతుంది బ్యూటిఫుల్ లావణ్య త్రిపాఠి. వీరిద్దరి ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు సమాచారం. అయితే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల వివాహం మొదట్లో నవంబర్ లేదా డిసెంబర్ లో జరుగుతుందని టాక్ వినిపించింది. కానీ, ఇప్పుడు వారి పెళ్లి ఇంకాస్తా ముందు జరగనుందని సమాచారం. వరుణ్-లావణ్య ఆగస్టు 24న పెళ్లి పీటలు ఎక్కునున్నట్లు టాక్.

చెమటలతో లావణ్య:ఇదిలా ఉంటే లావణ్య త్రిపాటి సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తరచుగా ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అలా తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. అందులో ఆమె జిమ్ లో చేమటోడుస్తూ దర్శనం ఇచ్చింది. ఆరెంజ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో అందాల విందు చేయడమే కాకుండా ఫిట్ నెస్ కోసం తెగ కష్టపడుతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

గ్లామర్ ట్రీట్-నెటిజన్లు షాక్:అయితే వరుణ్ తేజ్ సోదరి మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా అప్పుడప్పుడు జిమ్ లో వర్కౌట్ చేస్తున్న పిక్స్ పోస్ట్ చేస్తూ గ్లామర్ ట్రీట్ అందించేది. ఇప్పుడు తనకు కాబోయే వదిన లావణ్య కూడా నిహారిక బాటలో నడుస్తూ జిమ్ పిక్స్ వదిలిందా అని నెటిజన్స్ షాక్ అవుతున్నారు. లావణ్య ఇదివరకు ఘాటు ఫోటోలు షేర్ చేసేది. కానీ ఇలా జిమ్ పిక్స్ పెట్టడం తొలిసారి కావడంతో నెటిజన్స్ అలా రియాక్ట్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X