బికినీలో అదరగొట్టిన దిశాపటానీ.. స్విమ్‌సూట్‌లో బీచ్ బ్యూటీగా లోఫర్ భామ
బాలీవుడ్ నటి దిశా పటానీ బికినీ ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ సృష్టిస్తున్నది. లాక్‌డౌన్ సడలింపుతో ఒక్కసారిగా స్వేచ్ఛ లభించిన ఈ 'లోఫర్' భామ బీచ్‌లో తేలింది. వేసవి కాలంలో వేడి వేడి అందాలతో అభిమానుల్లో జోష్ నింపింది. తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసిన స్విమ్ సూట్ ఫోటో కొద్ది గంటల్లోనే రికార్డు స్థాయి లైక్స్ సంపాదించుకొన్నది. ఇక వివరాల్లోకి వెళితే..
స్వీయ గృహ నిర్బంధంలో
కరోనా లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలపాటు దిశా పటానీ ఇంటికే పరిమితమైంది. స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న ఆమె తన శరీర సౌందర్యంపై దృష్టిపెట్టారు. తన ఫిజిక్, ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టిన దిశ.. మరింత నాజుకూగా తయారైంది. పరిస్థితులు ఎలా ఉన్నా దిశపటానీ వర్కవుట్లు చేయకుండా ఉండరని తన సన్నిహితుల చెప్పుకొంటారు.
వర్కవుట్లతోనే దిన చర్య
తన రోజు వారీ దినచర్యలో భాగంగా దిశాపటానీ గంటల కొద్ది జిమ్‌లో గడుపుతుందట. తన శరీరాన్ని సవాల్ చేసే ఎక్సర్‌సైజ్‌లతో కఠోరంగా శ్రమిస్తుందట. కిక్స్, పంచుల్లాంటి కఠినమైన వర్కవుట్లు చేసి తన ఫిజిక్స్‌ను కాపాడుకుంటుంటుందని ఫ్రెండ్స్ వెల్లడించారు. అంతేకాకుండా ఆహార నియమాలను కఠినంగా పాటించే విషయంలో రాజీ పడబోదని చెప్పుకొంటారు.
6 గంటల్లోనే 16 లక్షల లైక్స్
ఇక లాక్‌డౌన్ తర్వాత స్విమ్ సూట్‌లో దర్శనమిచ్చిన దిశా పటానీ.. తన అందాలతో అదరగొట్టింది. సముద్ర ఒడ్డున బికినీలో అర్ధనగ్నంగా ఫోజిచ్చిన బ్యూటీ తన ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫోటోకు కేవలం 6 గంటల్లోనే 16 లక్షల లైక్స్ రావడం విశేషం. ఇక మొత్తంగా 24 గంటలకు ముగియక ముందే దాదాపు 20 లక్షల లైక్స్, వందలకొద్ది కామెంట్లు వచ్చాయి.

టైగర్‌తో డేటింగ్
ఇక దిశాపటానీ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఈ బ్యూటీ ఎప్పుడూ అఫైర్లు, రూమర్లతో కాలం వెళ్లదిస్తుంటుంది. బాలీవుడ్ కండల వీరుడు టైగర్ ష్రాఫ్‌తో ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వారిద్దరి సన్నిహితంగా, అన్యోన్యంగా ఉంటూ.. విదేశీ విహారయాత్రలు చేయడం కూడా మీడియాకు కనిపించింది. అయితే టైగర్ ష్రాఫ్‌తో మాత్రం అఫైర్ గట్టిగానే సాగుతుందనే తాజా సమాచారం.

దిశాపటానీ కెరీర్ ఇలా
ఇక సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల రిలీజైన భాగీ3 చిత్రంలో నటించారు. త్వరలో ప్రారంభం కానున్న సల్మాన్ ఖాన్ చిత్రం రాధేలో కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ సినిమాలో నటించారు. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. వరుణ్ తేజ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన లోఫర్ చిత్రంతో తన సినీ కెరీర్‌ను ఆరంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎంఎస్ ధోని బయోపిక్‌లో నటించింది.


Click it and Unblock the Notifications











