Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య న్యూ ఇయర్ 3 రిజల్యూషన్స్ ఇవే.. అభిమానులకు పెద్ద షాకే!
మెగా కోడలు లావణ్య త్రిపాఠి మరోసారి అభిమానులకు షాక్ ఇచ్చినట్లు అయింది. వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత.. వైవాహిక జీవితం గడుపుతూ.. మెగా కోడలిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ వేళ తన మూడు రిజల్యూషన్స్ ఇవే అంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే ఈ రిజల్యూషన్స్ చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అసలు విషయం ఏంటో ఈస్టోరీలో తెలుసుకుందాం.
హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల కొన్ని నెలల క్రితం మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ ని ప్రేమ పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత నుంచి నుంచి లావణ్య.. ఇంటి పట్టునే ఉంటూ మెగా కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. వరుణ్ తేజ్ తో లైఫ్ స్టార్ట్ చేసిన ఈ భామ.. వెకెషన్స్ కు వెళ్తతూ.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. వరుణ్ తో కలిసి ఇటీవలే హనీమూన్ ట్రిప్ కి ఫిన్ల్యాండ్ కూడా వెళ్ళొచ్చింది ఈ భామ.
Recommended Video


ఇక వారి హనిమూన్ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. ఇక క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని మెగా ఫ్యామిలీతో కలిసి చేసుకుంది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం లావణ్య మెగా కోడలు అయ్యాక మరింత వైరల్ అవుతుందనే చెప్పాలి. తాజాగా జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా తన న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది మెగా కోడలు లావణ్య త్రిపాఠి.
అందరి లాగానే లావణ్య త్రిపాఠి కూడా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకుంది. మరి లావణ్య పెట్టుకున్న 3 న్యూ ఇయర్ రిజల్యూషన్స్ చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంతకీ లావణ్య రిజల్యూషన్స్ ఏంటంటే... మొదటిది.. మంచి హ్యూమన్ బీయింగ్ గా ఉండాలి అని పెట్టుకుంది. ఇక రెండవది... నన్ను నేను ఎక్కువగా ప్రేమించుకోవాలి అని రిజల్యూషన్ పెట్టుకుంది. ఇక మూడవది.. సోషల్ మీడియాకు తక్కువ టైం ఇచ్చి ప్రకృతితో ఎక్కువ టైం గడపాలి అని నిర్ణయించుకుంది.

ఇక లావణ్య రిజల్యూషన్స్ చూసి నెటిజన్స్, అభిమానులు షాక్ అవుతున్నారు. దానికి కారణం... మంచి హ్యూమన్ బీయింగ్ అంటే ఓకే.. రెండోది.. నన్ను నేను ఎక్కువగా ప్రేమించుకోవాలి అనే దానికి.. మరి వరుణ్ తేజ్ కంటే నిన్నే ఎక్కువగా ప్రేమించుకుంటావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మూడో రిజల్యూషన్ ... సోషల్ మీడియాకు తక్కువ టైం ఇచ్చి.. ప్రకృతితో టైం గడపాలి.. దీంతో ఈ రిజల్యూషన్ తో మరింత షాక్ అయ్యారు అభిమానులు.
ఇప్పటికే లావణ్య త్రిపాఠి సినిమాలకు గుడ్ బై చెప్పింది.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా కనుమరిగై పోతే.. ఎలా అంటూ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఇకపై సోషల్ మీడియాలో కూడా కనబడకపోతే ఎట్లా లావణ్య అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక లావణ్య రిజల్యూషన్స్.. నెట్టింట వైరల్ గా మారాయి. మరి వీటిని ఎంతవరకు పాటిస్తుందో చూడాలి అంటున్నారు. ప్రస్తుతానికి లావణ్య చేతిలో ఒక తమిళ్ సినిమా ఉందని సమాచారం.


Click it and Unblock the Notifications











