Vedhika: మళ్లీ బికినీలో రెచ్చిపోయిన వేదిక.. పింక్ బికినీలో సోయగాల వల!
ఒకప్పుడు వరుస సినిమాలతో దక్షిణాదిలో సత్తా చాటిన వేదిక కరోనా ముందు రూలర్ సినిమా చేసి గ్యాప్ తీసుకుంది. అయితే ఆమె రీఎంట్రీ కోసం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అందుకే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలను షేర్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. మరీ ముఖ్యంగా కొద్దిరోజుల నుంచి ఎక్కువగా బికినీ ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లోని నిలవడానికి ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన బికినీ ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

మద్రాసి సినిమాలో
మహారాష్ట్ర, కర్ణాటక బోర్డర్ ప్రాంతానికి చెందిన వేదిక పుట్టింది అక్కడే అయినా పెరిగింది మాత్రం ముంబైలోనే. తొలుత కెరియర్లో మోడలింగ్ మొదలుపెట్టిన ఆమె తరువాత కొన్ని యాడ్ ఫిలిమ్స్ కూడా చేసింది. తర్వాత అర్జున్ సర్జా హీరోగా నటించిన మద్రాసి అనే సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం రావడంతో అలా ఆమె తెరంగ్రేటం చేసింది. అయితే మొదటి సినిమా అదే అయినా ఆమెకు పేరు తెచ్చిన సినిమా మాత్రం ముని. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా తెలుగులో కూడా డబ్బింగ్ అయి విడుదలైంది.

బాణం సినిమా
అలా ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ఒక ఏడాది తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన విజయదశమి సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అది ఆమెకు మంచి పేరు అయితే తీసుకురాలేదు. అయితే కొన్నాళ్లపాటు తమిళ కన్నడ సినిమాలు చేసిన ఆమె మళ్ళీ 2009లో బాణం సినిమాలో నారా రోహిత్ సరసన నటించి మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. తర్వాత దగ్గరగా దూరంగా అనే సినిమా చేసిన తర్వాత ఆమె తెలుగుకి సుదీర్ఘ గ్యాప్ తీసుకుంది.

తనదైన అందంతో
ఈ మధ్యలో అనే తమిళ కన్నడ మలయాళం సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపింది. చివరిగా ఆమె బాలకృష్ణ హీరోగా నటించిన రూలర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత దేశంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో ఆమె కూడా కాస్త గ్యాప్ తీసుకుంది. చివరిగా ఈ ఏడాది బంగార్రాజు సినిమాలో మేనక పాత్రలో నటించి ఆమె మెప్పించింది. కనిపించింది కొంచెం సేపు అయినా ఆమె తనదైన అందంతో ఆకట్టుకుంది.

బికినీ ఫోటోలను
ప్రస్తుతం ఆమె తమిళ, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలలో బిజీగా ఉంది. అలాగే తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న జంగిల్ అనే సినిమాలో కూడా నటిస్తోంది. అయితే ఈ మధ్యన ఆమె హాట్ షో చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. అందులో భాగంగానే ఆమె తాజాగా మాల్దీవులకు వెళ్ళగా అక్కడ తన బికినీ ఫోటోలను షేర్ చేసి కాక రేపింది.

పింక్ బికినీలో
పింక్ బికినీలో అందాలు ఆరబోస్తున్న ఆమె ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెంటనే వైరల్ అయ్యాయి. ఆమె అలాంటి ఫోటోలు షేర్ చేస్తే అభిమానులు ఊరుకుంటారా వెంటనే రకరకాల కామెంట్లు పెట్టి ఆమె అందాల మీద కవితలు రాసేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











