Honey Rose ఊహించని డిమాండ్.. అందుకే అవకాశాలు రావట్లేదట!
గ్లామరస్ బ్యూటీగా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న హీరోయిన్స్ లలో హాని రోజ్ ఒకరు. ఈ బ్యూటీ ఎలాంటి స్టిల్ ఇచ్చిన కూడా సోషల్ మీడియాలో చాలా తొందరగానే వైరల్ అవుతున్నాయి. అలాగే ఈవెంట్స్ లలో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇక షాపింగ్ మాల్స్ అంటూ ఆమె ఎక్కడ ఓపెనింగ్స్ కు వెళ్లినా కూడా జనాలు నిలబడి ఆమెను చూసేందుకు ఎగబడుతున్నారు. హాని రోజ్ అంటే ఇప్పుడు స్పెషల్ క్రేజ్ అయితే పెరుగుతుంది. ఇక సోషల్ మీడియాలో ఆమె నిత్యం గ్లామర్ తో కుర్రాళ్ళ మతిపోగొట్టేస్తోంది.
అయితే హనీ రోజ్ కు క్రేజ్ బాగానే ఉన్నప్పటికీ కూడా ఆమెకు పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలో ఆమె నందమూరి బాలకృష్ణకు జోడిగా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించింది. అందులో తల్లి పాత్రలో కూడా నటించడమే ఊహించని విధంగానే ఒక షాక్ అయితే ఇచ్చింది. అయితే సోషల్ మీడియాలో పెరుగుతున్న క్రేజ్ ను బట్టి రీసెంట్ గా చాలామంది అవకాశాలు అందుకున్నారు. కానీ హాని రోజ్ కు మాత్రం పెద్దగా అవకాశాలు రావడం లేదు.

అసలైతే ఈ బ్యూటీ గత రెండేళ్లుగానే ఎక్కువగా క్రేజ్ అందుకుంటోంది. అమ్మడు ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలం అయ్యింది. 2005 లోనే ఒక మలయాళం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఇక అనంతరం తెలుగులో వరుణ్ సందేశ్ తో 2014 లో ఈ వర్షం సాక్షిగా అనే మరో సినిమా చేసింది. కానీ అదేమీ అంతగా వర్కౌట్ కాలేదు. ఇక సౌత్ లో అయితే ఆమెకు ఎక్కువగా మలయాళం ఇండస్ట్రీలోనే అవకాశాలు వస్తున్నాయి.
అయితే వీరసింహా రెడ్డి అనంతరం ఈ ఏడాది ఆమెకు పెద్దగా అవకాశాలు ఏమి రావడం లేదు. అందుకు కారణం హాని రోస్ ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. దాదాపు 3 నుంచి 4 కోట్ల మద్యలో ఇప్పుడు అడుగుతోందట. కానీ నిర్మాతలు ఆమెకు ఆ స్థాయిలో ఇవ్వడానికి సిద్ధంగా లేరట. కేవలం కోటి రూపాయల రెమ్యునరేషన్ మాత్రమే ఇవ్వడానికి ఆఫర్ చేస్తున్నట్టు టాక్ వస్తోంది. మరి హాని రోజ్ రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











