twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాజల్ అగర్వాల్ హారర్ వెబ్ సిరీస్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్

    |

    టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 12 ఏళ్లవుతోంది. అయినా కూడా తన క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హిరోలందరితో అమ్మడు వర్క్ చేసింది. ఇక ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలతో కూడా రొమాన్స్ చేయడానికి కూడా సిద్ధమవుతోంది.

    కేవలం సినిమాలనే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటించాలని కాజల్ అగర్వాల్ ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓటీటీల జోరు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో డిజిటల్ మిడియాలోనే స్టార్స్ అందరు బిజీ అవుతారని సినీ పండితులు చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది స్టార్స్ వెబ్ సిరీస్ లలో నటించారు. ఇక నెక్స్ట్ కాజల్ అగర్వాల్ కూడా ఒక హారర్ వెబ్ సిరీస్ లో నటించనున్నట్లు తెలుస్తోంది.

    Venkat prabhu about Kajal agarwal horror web series

    దర్శకుడు వెంకట్ ప్రభు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకట్ తన భవిష్యత్తు ప్రాజెక్టులపై స్పందిస్తూ.. త్వరలో ఒక వెబ్ సిరీస్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు చెప్పారు. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ వెబ్ సిరీస్ లో కాజల్ తో పాటు వైభవ్ - ఆనంది వంటి స్టార్స్ నటిస్తున్నట్లు తెలియజేశారు.

    ఇక ఆ వెబ్ కంటెంట్ 7 ఎపిసోడ్స్ వరకు ఉంటుందని చెబుతూ కాజల్ పాత్ర అద్భుతంగా ఉంటుందని త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. మరి ఆ వెబ్ సిరీస్ తో కాజల్ అగర్వాల్ ఏ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంటుందో చూడాలి.

    English summary
    Kajal Agarwal planned to get married within the last year. Kajal finished her own sister marriage, and also kajal plans to go into Marriage Life. Talk to family members and come to a decision. There were reports that Kajal had put a small businessman on the line. But the beauty gave no clarity on those rumors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X