గ్లామర్ హద్దులు తెంచేసిన సమంత..వెంకటేష్ కుమార్తె ఆసక్తికర కామెంట్.. పరోక్ష సిగ్నల్స్ ఇస్తున్నట్టా?
పెళ్లయిన తర్వాత సమంత అందాల ఆరబోత విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపించినా కానీ సమయం దొరికితే అందాలు ఆరబోసేందుకు ఆమె ఏ మాత్రం వెనుకాడేది కాదు. వ్యక్తిగత విషయాలతో భర్త నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న సమంత ఇప్పుడు అందాల ఆరబోతకు బ్రేకులు లేవు అన్నట్లు దూసుకుపోతోంది. తాజాగా ఆమె ఒక అవార్డు ఫంక్షన్ కోసం అందాలు ఆరబోయడం ఆ ఫోటోలకు వెంకటేష్ కుమార్తె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

గ్రీన్ సిగ్నల్ ఇస్తూ
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన సినిమాల మీద దృష్టి పెట్టింది. అలాగే అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదు అనే విధంగా ఆమె రకరకాల హాట్ ఫోటో షూట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాక బ్లోడ్ పాత్రలకు, ఐటెం సాంగులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతోంది. తాజాగా ఒక అవార్డు ఫంక్షన్ లో ఆమె వేసుకున్న డ్రెస్ కూడా చర్చనీయాంశమైంది.

అందాలు ఆరబోస్తూ
విడాకుల తర్వాత సమంత సినిమాల జోరు పెంచిడమే కాక వరుస సినిమాల్లో నటిస్తూ అందరి మన్ననలను అందుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఆమెకు ఇటీవలే క్రిటిక్స్ చాయిస్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. ప్రస్తుతానికి ఆమె ఆ అవార్డు అందుకునేందుకు ఆమె ముంబైలో మకాం వేసింది ఉంది. ఈ అవార్డు ఫంక్షన్ కోసం ఎమరాల్డ్ గ్రీన్, నలుపు రంగు డ్రెస్ లో తళుక్కున మెరవడమే కాక అందాలు ఆరబోస్తూ తన అందంతో అందరినీ కట్టిపడేసింది.

'ముచ్చటేస్తోంది..' అంటూ
ఆ ఫొటోస్ ఇన్ స్టాగ్రామ్ లో ‘నాకు అత్యంత ఇష్టమైన లుక్కిది' అంటూ పోస్ట్ చేసిన సమంతకు అభినందనలు వెల్లువలా వచ్చి కురుస్తున్నాయి. తాజాగా నాగచైతన్య మేనమామ, హీరో వెంకటేష్ కుమార్తె దగ్గుబాటి ఆశ్రిత కూడా కామెంట్ చేసింది. ఫుడ్ లవర్ అయిన ఆమె ఇన్ఫినిటీ ప్లాటర్ పేరిట ఇన్ స్టాగ్రామ్ ఖాతా రన్ చేస్తుంది. ఆ ఖాతా నుంచి 'ముచ్చటేస్తోంది..' అంటూ ఓ ఎమోజీని పోస్ట్ చేసింది.

పరోక్ష సందేశంగా
నిజానికి విడాకుల తర్వాత సమంత పుష్పలో ఊ అంటావా ఐటెమ్ నంబర్‌తో తెరపైకి వచ్చింది. ఈ బోల్డ్ డ్యాన్స్ నంబర్‌లో ఆమె హాట్ హాట్ డ్యాన్స్ మూవ్‌లు గ్లామర్ ప్రేమికులకు కన్నుల పండుగగా మారాయి. అయితే సమంత ఈ అందాల ఆరబోత విషయంలో సమంత వెనక్కు తగ్గే సూచనలు అయితే కనిపించడం లేదు. సమంత సోషల్ మీడియా టైమ్‌లైన్‌ను పరిశీలిస్తే, ఆమె గ్లామర్ ట్రీట్ బాగా పెంచిందని స్పష్టంగా తెలుస్తుంది. తన గ్లామర్‌ను 'బహిర్గతం' చేయడానికి సామ్ చేసిన ఈ ఫోటోషూట్ లు చిత్రనిర్మాతలకు పరోక్ష సందేశంగా పరిగణించబడుతుందని అంటున్నారు.
Recommended Video

సినిమాల విషయానికి వస్తే
తొలుత పుష్ప ఐటమ్ నంబర్ చేయడానికి సమంత సంకోచించినప్పటికీ, ఆమె తర్వాత దాన్ని చేసేసి అద్భుతమైన హిట్ అందుకుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ‘యశోద' చిత్రీకరణ సాగుతోంది. తమిళ్‌లో నటిస్తున్న ‘కాతు వాకుల రెండు కాదల్' సినిమా కూడా వేగంగా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన మరో హీరోయిన్ నయన తారతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.


Click it and Unblock the Notifications











