గ్లామర్ క్వీన్‌గా మారిన వెంకీ బ్యూటీ.. ఐశ్వర్య ను ఇలా ఎప్పుడూ చూసుండరు..
Aishwarya Rajesh: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.. తెలుగింటి అమ్మాయి. ప్రస్తుతం 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నది. ఈ మూవీలో వెంకటేష్ హీరోగా నటిస్తుండగా.. డైరెక్టర్ అనిల్‌రావిపూడి దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో వెంకటేష్ భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించారు. మరొక కథానాయికగా, హీరో మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షి నటించారు. ఈ సినిమా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే.. తాజాగా ఐశ్వర్యకు సంబంధించిన ఫోటో షూట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లూక్కేయండి.
హీరోయిన్ ఐశ్యర్య రాజేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పావల్సిన అవసరం లేదు. గతంలో వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్‌తో పాటు మరికొన్ని సినిమాలు నటించి, తెలుగు ప్రేక్షకులు మెప్పించింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. అమ్మడు నటించిన సినిమాలు మాత్రం అంత కమర్షియల్ హిట్ మాత్రం కాలేకపోయాయి. మరో వైపు తమిళంలో హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది. అక్కడ కూడా తన నటనతో మెప్పించింది. తనకంటూ ఓ సఫరేట్‌గా ఫ్యాన్ బేస్‌ను ఏర్పరుచుకుంది.

మరో ఇంట్రెస్టింగ్ విషయమేమింటంటే.. ఐశ్వర్య రాజేష్ తండ్రి, తాత కూడా సినీ పరిశ్రమలో నటులుగా రాణించారు. ఐశ్వర్య రాజేష్ తాత అమరనాథ్ 1950 -60 మధ్యకాలంలో పలు తెలుగు సినిమాల్లో హీరోగా నటించారు. ఇక ఐశ్వర్య తండ్రి రాజేష్ కూడా సినిమాల్లోనే అడుగుపెట్టాడు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన 'నెలవంక మూవీతో రాజేష్ హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమాకు మంచి పేరు రావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా.. రెండు జళ్ల సీత, ఆనందభైరవి సినిమాల్లో వంటి బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచాయి. ఆయన కేవలం హీరోగానే కాదు విలన్ గా నెటిగివ్ రోల్స్ ల్లో కూడా రాణించారు.
ఐశ్వర్య తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి తొలుత బుల్లితెరపై అడుగుపెట్టింది. ఐశ్వర్యరాజేష్ తొలుత సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత ఆ ఫేమ్ తో సినిమాల్లోకి అడుగుపెట్టి హీరోయిన్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నది.తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు ఓ హిందీ సినిమాలోనూ నటించింది. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన లెటెస్ట్ అండ్ మోడ్రన్ ఫోటో షూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటో సోషల్ మీడియాలో తెగవైరలవుతోంది. మీరు కూడా ఓ లూక్కేయండి.


Click it and Unblock the Notifications











