అందుకే రష్మిక బ్రేకప్.. కాంగ్రెస్ ఎంపీగా పోటీ.. బయట పెట్టిన వేణుస్వామి

కన్నడ కస్తూరి రష్మిక మందన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రస్తుతం తెలుగు సహా దక్షిణాది భాషల్లో కాక ఉత్తరాదిలో కూడా బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఆమె అలా కావడానికి తానే కారణం అంటున్నారు వేణు స్వామి. తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్యుడుగా ఫేమస్ అయిన ఆయన రష్మిక మందన్న కెరియర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

బ్రేకప్ చెప్పుకుందట

బ్రేకప్ చెప్పుకుందట


కర్ణాటకలో కొడగు ప్రాంతానికి చెందిన రష్మిక మందన్న చలో అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా చేసేనాటికే ఆమె కన్నడలో కిరాక్ పార్టీ అనే సినిమా చేశారు. ఆ సినిమాలో హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన ఆమె అతనితో నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. అయితే తెలుగులో చలో సినిమాతో హిట్ అందుకున్న ఆమెకు వరుస సినీ అవకాశాలు లభించాయి. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోయిన్ గా మారాలి అంటే ఏం చేయాలి అంటూ వేణు స్వామిని సంప్రదించడంతో ఆ సమయంలో వేణు స్వామి ఆమె జాతకాన్ని ఆమె ప్రియుడి జాతకాన్ని పరిశీలించి మీరిద్దరూ విడిపోతేనే మీ కెరియర్స్ లో బాగుంటారని చెప్పడంతో తన కెరీర్ కోసం ఆయనతో బ్రేకప్ చెప్పుకుందట రష్మిక మందన్న.

 కాంగ్రెస్ పార్టీ తరఫున

కాంగ్రెస్ పార్టీ తరఫున


వేణు స్వామి చెప్పిన ఒక పూజ చేయడంతో ఆమె దశ మారిపోయిందని వేణు స్వామి చెబుతున్నారు రాజశ్యామల యాగం అనే ఒక యాగాన్ని జరిపించానని దీంతో ఆమెకు తెలుగు సహా దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో కూడా సూపర్ క్రేజ్ ఏర్పడిందని చెప్పుకొచ్చారు. అంతేకాక రష్మిక మందన్న తన కెరీర్లో రాజకీయాల్లోకి కూడా వెళుతుందని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ఎంపీగా కూడా గెలుస్తుందని చెప్పుకొచ్చారు.

ఉత్తరాదిలో కూడా

ఉత్తరాదిలో కూడా


కర్ణాటక నుంచి ఆమె ఎంపీగా పోటీ చేస్తుందని ఎంపీగా పోటీ చేసి గెలుస్తుందని కూడా ఆయన అన్నారు. ఇక రష్మిక మందన్న ప్రస్తుతం చేస్తున్న సినిమా విషయానికి వస్తే గత ఏడాది ఆమె చేసిన పుష్ప సినిమా ఆమెకు సూపర్ క్రేజ్ తీసుకు వచ్చింది. పుష్ప సినిమాలో శ్రీవల్లి అనే పాత్రలో నటించిన రష్మిక మందన్న ఆ సినిమా ద్వారా దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో కూడా సూపర్ క్రేజ్ దక్కించుకుంది.

పుష్ప 2

పుష్ప 2


ఇక ప్రస్తుతం ఆమె వరుస హిందీ సినిమాలతో దూసుకు వెళుతోంది. మరి కొద్ది రోజుల్లో పుష్ప 2 ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆ పుష్ప 2 సినిమాలో కూడా రష్మిక మందన్న పాత్ర అద్భుతంగా ఉంటుందని, సినిమా మొత్తం మీద ఆమె పాత్ర హైలైట్ అవుతుందని సినీ యూనిట్ చెబుతోంది.

ఉత్తరాదిలో కూడా

ఉత్తరాదిలో కూడా


ఇక రెండో భాగంతో కూడా ఆమె దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో కూడా సూపర్ క్రేజ్ దక్కించుకోవడం ఖాయం అని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ మధ్యనే హాట్ షో కూడా మొదలుపెట్టిన ఈ భామ మరిన్ని తెలుగు అవకాశాలు మాత్రమే కాకుండా హిందీ అవకాశాలు కూడా దక్కించుకొని నాలుగు రాళ్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X