Vicky Kaushal and Katrina Kaif marriage: పెళ్లికి ముందే అలా పట్టుబడ్డ కత్రినా, వికీ.. పెళ్లి ఎక్కడ? ఎప్పుడంటే?
బాలీవుడ్‌లో మరో స్టార్ కపుల్ పెళ్లికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే అనుష్క, దీపిక పదుకోన్, ప్రియాంక చోప్రా లాంటి టాప్ హీరోయిన్స్ ప్రేమ వివాహం చేసుకొని ప్రశాంతంగా దాంపత్య జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కత్రినా కైఫ్ కూడా వారి జాబితాలో చేరేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ మీడియాలో కత్రినా కైఫ్, వికీ కౌశల్ పెళ్లి వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరు కూడా పెళ్లి జరుగుతుందనే విషయాన్ని పరోక్షంగా మీడియాకు లీకులు ఇవ్వడం మరింత చర్చనీయాంశమైంది. కత్రినా, వికీ కౌశల్ ప్రేమ, వివాహానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కొద్దికాలంగా పీకల్లోతు ప్రేమలో
కత్రినా కైఫ్, వికీ కౌశల్ గత కొద్దికాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. కోవిడ్ సమయంలో వీరిద్దరి ప్రేమ కహనీలు మీడియాలో కథకథలుగా కథనాలుగా మీడియాలో కనిపించాయి. లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో వారిద్దరూ ఒకే ఇంటిలో ఉంటూ సహజీవనాన్ని ఆస్వాదిస్తున్నారనే విషయం మీడియాలో ప్రముఖంగా మారింది.

ఇద్దరికి ఒకేసారి కోవిడ్..
ముంబైని కరోనావైరస్ పట్టి పీడిస్తున్న సమయంలో ఇద్దరికి ఒకేసారి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే వారిద్దరూ వేర్వేరుగా కోవిడ్‌కు ట్రీట్‌మెంట్ తీసుకొని బయట పడ్డారు. దాంతో వారి ప్రేమ వ్యవహారానికి అధికారిక ముద్ర పడింది. అయితే వారిద్దరూ ఎప్పుడూ తమ ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించలేదు.

లవ్ అఫైర్‌ను లీక్ చేసిన అక్షయ్ కుమార్
వికీ కౌశల్‌తో కత్రినా కైఫ్ ప్రేమ వ్యవహారాన్ని అక్షయ్ కుమార్, కరణ్ జోహర్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. అక్షయ్ నటించిన సూర్యవంశ్ ప్రమోషన్‌లో కత్రినా ప్రేమలో ఉందనే విషయాన్ని స్టేజ్ మీద చెప్పారు. దాంతో ఆమె ముసి ముసి నవ్వులు రువ్వుతూ మౌనంగా ఉండిపోయింది. అయితే తమ ప్రేమ వ్యవహారంపై వస్తున్న కథనాలను ఎన్నడూ ఖండించలేదు.

మీడియా కంటికి చిక్కిన వికీ, కత్రినా కైఫ్
ఇటీవల పెళ్లి పనుల్లో బిజీగా ఉంటున్నారనే వార్తల మధ్య వికీ కౌశల్, కత్రినా మీడియాకు చిక్కారు. ఒకే కారులో ముంబై వీధుల్లో షికారు చేస్తూ ఫోటోగ్రాఫర్లకు చిక్కారు. అయితే మీడియా కెమెరాల నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నించడం హైలెట్‌గా మారింది. అయితే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకొంటున్నారనే వార్తలు మాత్రం జోరందుకొన్నాయి.
Recommended Video

పెళ్లి వేదిక ఎక్కడ, ముహుర్తం ఎప్పడంటే
బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. వికీ కౌశల్, కత్రినా కైఫ్ డిసెంబర్ 2021లో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. వారి పెళ్లి వేదిక కూడా ఖరారైంది. రాజస్థాన్‌లోని మధోపూర్‌లోని రాయల్ పెళ్లి వేదిక వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. 14వ శతాబ్దం నాటి సెక్స్ సెన్సెస్ బార్వారా కోట కత్రినా పెళ్లికి ముస్తాబువుతున్నది. ఈ కోటను రాజస్థాన్‌కు చెందిన రాజవంశీకులు కట్టించారు. రాంథంబోర్ నేషనల్ పార్క్‌కు ఈ వేదిక 700 కిలోమీటర్ల దూరంలో ఉంది.


Click it and Unblock the Notifications











