చావా డైరెక్టర్ కిడ్నాప్.. దారుణానికి తెగబడ్డ రష్మిక మందన్న.. అసలేం జరిగిందంటే?

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందాన గురించి ప్రత్యేకంగా చెప్పాల్పిన అవసరం లేదు. ఈ కన్నడ బ్యూటీ టాలీవుడ్ లో తన అందం, అభినయంతో వరుస అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలో స్టార్ హీరోల సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసి వరుస విజయాలను అందుకుని స్టార్ హీరోయిన్ గా మారింది. కోట్లాది మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది రష్మిక. ఇక అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప' సినిమాతో ఈ అమ్మడు జాతకమే మారింది. ఇటీవల బాలీవుడ్ లో అడుగుపెట్టి.. వరుసగా సినిమాలు చేస్తూ.. దుమ్మురేపుతోంది. తాజాగా ఈ అమ్మడు పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. ఈ పోస్టు చూసిన ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

రష్మిక కెరీర్ లో పుష్ప సినిమా ఓ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప 1' మూవీలో శ్రీవల్లి పాత్రలో నటించి, మెప్పించింది రష్మిక . ఈ పాత్రతో రష్మిక జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇక 'పుష్ప 2: ది రూల్‌'(2024) సినిమా ఏ స్థాయిలో విజయం సాధించి, వసూళ్లతో పాటు రికార్డులు సాధించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అంతకుముందు సందీప్ రెడ్డి వంగ 'యానిమల్'లో బోల్డ్ గా నటించి మెప్పించింది. ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ అమ్మడు బాలీవుడ్ కూడా వరుసగా సినిమాలు చేస్తోంది.

Vicky Kaushal and Rashmika Mandanna Kidnap Chhaava Director Laxman Utekar for a Mini Photoshoot

తాజాగా ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ఛావా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను డైరెక్టర్ లక్ష్మణ్‌ ఉటేకర్‌ రూపొందించగా.. విక్కీ కౌశల్‌ కథానాయకుడిగా నటించారు. ఇందులో రష్మిక శంభాజీ భార్య ఏసుబాయిగా నటించింది. ఈ సినిమాలో అక్షయ్‌ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ ప్రమోషనల్స్ లో రష్మిక బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా 'ఛావా' బృందంతో పాటు రష్మిక స్వర్ణ దేవాలయాన్ని సందర్శించింది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఫోటోలను సోషల్‌ మీడియాల్లో పంచుకున్నారు.

ప్రస్తుతం విక్కీ కౌశల్, రష్మిక మందన్న లు "చావా" ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా నేషనల్ క్రష్ తన లేటెస్ట్ ఫోటో షూట్ ను ఇస్టాగ్రామ్ వేదిక షేర్ చేసింది. అందులో మొదటి ఫోటోలో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తో విక్కీ కౌశల్,రష్మిక మందన్న ఉన్నారు. ఆ తర్వాత ఫోటోలో ఈ జంట కిస్సింగ్ ఫోజులున్నాయి. ఈ ఫోటోలను రష్మిక షేర్ చేస్తూ.. " లక్ష్మణ్ సార్ ఎడిటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. అందుకే నేను, విక్కీ అతన్ని కిడ్నాప్ చేసి ఒక చిన్న ఫోటోషూట్ చేస్తున్నాం.. 'ఛావా' సినిమా 3 రోజుల్లో విడుదల కానుంది. చాలా ఎగ్జైట్ గా ఉంది, ఈ విషయం చెప్పడానికి మేము మా చిన్న షూట్ చేసాం" అని రాసుకోచ్చింది. ప్రస్తుతం రష్మిక పోస్ట్ వైరల్ గామారింది. ఫోటో షూట్ కోసం కిడ్నాప్ చేయాలా? ఇదేం ప్రమోషన్స్ రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

ఇదెలా ఉంటే.. రష్మిక చేతులో వరుస సినిమాలున్నాయి. 'సికిందర్'అనే బాలీవుడ్ మూవీ కూడా ఉంది. ఈ సినిమాకు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తుండగా.. రష్మిక సరసన బాలీవుడ్ కండాల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తికాబోతుంది. షెడ్యూల్ ప్రకారం ఈసినిమా మార్చిలో విడుదల కానుంది. ఇలా భారీ బడ్జెట్, మల్టీ స్టారర్ మూవీలో రష్మికకు బాలీవుడ్ లో మరో భారీ అవకాశం లభించింది. అంతే కాకుండా.. 'కుబేర', 'థామా', 'ది గర్ల్‌ఫ్రెండ్‌', 'రెయిన్‌ బో' సినిమాల్లో రష్మిక యాక్ట్‌ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X