కత్రినాతో ప్రేమలో పడలేదు.. ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చెప్పిన విక్కీ కౌశల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్రిటిష్ లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో హీరోయిన్ గా సెట్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు కత్రినా కైఫ్ తన కెరియర్ బిగినింగ్ ను టాలీవుడ్ తోనే ప్రారంభించింది. విక్టరీ వెంకటేష్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ ఫిలిం మల్లీశ్వరి చిత్రంతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు నందమూరి నట సింహం బాలకృష్ణ సరసన కూడా అల్లరి పిడుగు చిత్రంలో నటించి మరోసారి సందడి చేసింది.
అప్పటికే ఆ ముద్దుగుమ్మ బ్యూటీనెస్, ఫిట్నెస్ కు బాలీవుడ్ దర్శకులు ఫిదా అయ్యి. ఆమెకు అటువైపు అవకాశాలు అందించారు. ఇక 2005 లో రిలీజ్ అయిన రాంగోపాల్ వర్మ దర్శకత్వంలోని సర్కార్ చిత్రంలో అభిషేక్ బచ్చన్ కు ప్రేయసిగా నటించింది. అలా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కత్రినా కైఫ్ తన టాలెంట్ తో ఉన్నత స్థాయికి ఎదిగింది. ఏకంగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. రన్బీర్ కపూర్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.

18 ఏళ్ల పాటు బాలీవుడ్లో తన సత్తా చాటింది. ఇక 2018 తర్వాత నుంచి నామమాత్రంగానే సినిమాలు చేస్తుంది. అయితే 2021లో కత్రినా కైఫ్ బాలీవుడ్ నటుడు విక్కీ కౌషల్ ను పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి కత్రినా కైఫ్ సినిమాల కంటే ఎక్కువగా తన ఫ్యామిలీ, నా భర్తతో సమయం గడిపేందుకు ఇష్టపడుతుంది. ఇక తప్పని పరిస్థితుల్లోనే వెండితెరపై కనిపిస్తుంది. అయితే బాలీవుడ్ లో కత్రినా కైఫ్ ఉన్నంత క్రేజ్ తన భర్త విక్కీ కౌశల్ కు లేక పోయింది. అయినప్పటికీ కత్రినా విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇక విక్కీ కౌషల్ రీసెంట్ గా చత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం కథ ఆధారంగా తెరకెక్కించిన ఛావా చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. 500 కోట్లకు పైగా వసూలు సాధించి బాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం విక్కీ కౌశల్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న తరుణంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను చెప్పుకొచ్చారు. కత్రినా కైఫ్ తో తన లవ్ స్టోరీని తాజాగా వివరించారు. అయితే విక్కీ కౌశల్ మొదట్లో కత్రినా కైఫ్ తో ప్రేమలో పడలేదంట. అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్ కావడంతో తనని ఎలా ప్రేమిస్తుందని అనుకున్నారంట.
కానీ బాలీవుడ్ ఇండస్ట్రీ లోపల విక్కీ కౌశల్ కు మంచి పేరు ఉండడంతో కత్రినా కైఫ్ కు బాగా నచ్చేసాడంట. కానీ విక్కీ కౌశల్ మాత్రం కత్రినాకు నేనే ఎందుకు అనే సందేహం ఉండిందంట మొదట్లో.. ఆమె స్టేటస్, ఫేమ్ చూసి అసలు ప్రేమలో పడలేదని కూడా చెప్పారు. కానీ వారి పరిచయం తర్వాత కొద్ది రోజులకు కత్రినా కైఫ్ లోని హ్యుమానిటీ తనకు బాగా నచ్చిందట. ఇక కత్రినా కైఫ్ ను ఆమె మంచి వ్యక్తిత్వమే ప్రేమించేలా చేసిందంట. కత్రినా కైఫ్ అటెన్షన్ ను తన వైపు తిప్పుకోవడానికి చాలా సమయం పట్టింది అని కూడా చెప్పారు. అంతేగాని ఆమెకున్న పేరును చూసి మాత్రం ప్రేమలో పడలేదని సూచించారు. ఇక 2021 డిసెంబర్ 9న హిందూ సాంప్రదాయం ప్రకారం రాజస్థాన్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది.


Click it and Unblock the Notifications











