For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రియుడితో కత్రినా కైఫ్ లాక్‌డౌన్.. ఇంట్లోకి దూరుతూ కెమెరాకు చిక్కిన యువహీరో

  |

  బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్‌కు గతంలో పలువురు బాలీవుడ్ హీరోలతో అఫైర్లు, బ్రేకప్‌లు జరిగిన విషయం సగటు సినీ ప్రేక్షకుడికి తెలిసిందే. తాజాగా మళ్లీ కత్రినా యంగ్ హీరోతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ముంబైలో కరోనా లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో కత్రినా ఇంట్లోకి ఆ యంగ్ హీరో దూరడం మీడియా కంటపడింది. దాంతో కొన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యవహారం బయటి ప్రపంచానికి పొక్కింది. కత్రినా కైఫ్ అఫైర్ గురించి వివరాల్లోకి వెళితే..

  Katrina Kaif Showers Praises On Lady Superstar Nayanthara
   సల్మాన్, రణ్‌బీర్‌తో అఫైర్లు

  సల్మాన్, రణ్‌బీర్‌తో అఫైర్లు

  గతంలో కత్రినా కైఫ్‌కు సల్మాన్ ఖాన్‌తో, ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్‌తో అఫైర్లు కొనసాగాయి. అయితే పెళ్లి వరకు వచ్చి సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ బంధాలకు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత పెద్దగా ఎవరితోనూ డేటింగ్ చేసినట్టుగానీ, అఫైర్ పెట్టుకొన్నట్టు దాఖలు లేవు. తాజాగా వికీ కౌశల్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

   కొద్దికాలంగా వికీ కౌశల్‌తో

  కొద్దికాలంగా వికీ కౌశల్‌తో

  గత కొద్దికాలంగా యువ హీరో వికీ కౌశల్‌కు, కత్రినా కైఫ్‌కు మధ్య అఫైర్ కొనసాగుతున్నదనే విషయం బాలీవుడ్ మీడియాలో కథకథలుగా చెప్పుకొంటున్నారు. అయితే మా మధ్య అలాంటి రిలేషన్‌షిప్ ఉందనే విషయం చెప్పడానికి ఇద్దరు స్పందించలేదు. అయినా రూమర్లు విస్తృతంగా ప్రచారమవ్వడం ఆగలేదు.

  కత్రినాతో బంధంపై వికీ కౌశల్ రియాక్షన్

  కత్రినాతో బంధంపై వికీ కౌశల్ రియాక్షన్

  అయితే పలుమార్లు కత్రినాతో కలిసి ఉండటాన్ని ఫొటో జర్నలిస్టుల ప్రశ్నిస్తే.. మీ జాబ్ మీరు చేస్తున్నారు. పబ్లిక్ ఫిగర్లు కావడం వల్ల మా వ్యక్తిగత జీవితాలపై ఇతరలకు ఆసక్తి ఉండటం సహజం. అలాగని మా వ్యక్తిగత బంధాల గురించి వాటిపై చర్చ జరగాలని కోరుకోవడం లేదు. నా వ్యక్తిగత జీవితం గురించి నా ఇతరులకు చెప్పలేను అని వికీ కౌశల్ జవాబిచ్చారు.

  ముఖానికి మాస్క్‌తో కత్రినా ఇంట్లోకి వికీ కౌశల్

  ముఖానికి మాస్క్‌తో కత్రినా ఇంట్లోకి వికీ కౌశల్

  ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్టు 9వ తేదీన ఆదివారం కత్రినా కైఫ్ ఇంట్లో వికీ కౌశల్ కనిపించారు. ముఖానికి మాస్క్, చేతికి గ్లౌస్‌లు తొడుక్కొని కారులో నుంచి దిగితూ మీడియా కెమెరాలకు చిక్కారు. ట్రాక్ ప్యాంట్, టీ షర్ట్ ధరించి ఇంట్లోకి వెళుతూ కనిపించారు. దీంతో వారి మధ్య రిలేషన్‌షిప్‌కు స్పష్టమైన సాక్ష్యం లభించింది.

   #VicKat నెటిజన్లు హ్యాష్‌టాగ్‌ ట్రెండ్

  #VicKat నెటిజన్లు హ్యాష్‌టాగ్‌ ట్రెండ్

  కత్రినా కైఫ్‌ ఇంట్లోకి వికీ కౌశల్ వెళ్తూ మీడియాకు చిక్కడంపై నెటిజన్లు #VicKat అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండింగ్ మొదలుపెట్టారు. మాకు ఈ రోజు సంతోషకరమైన దినం. ప్రేమంటే ఇదేరా.. ఓ మై గాడ్.. ఎట్టకేలకూ.. మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ అనే కామెంట్లతో ట్రెండ్ చేశారు.

   వికీ కౌశల్ కెరీర్ ఇలా..

  వికీ కౌశల్ కెరీర్ ఇలా..

  వికీ కౌశల్ కెరీర్ విషయానికి వస్తే.. రాజీ, సంజూ చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు పొందలేదు. కానీ యూరీ: ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంతో మంచి సక్సెస్ కొట్టడమే కాకుండా జాతీయ ఉత్తమ అవార్డును గెలుచుకొన్నారు. భారత చీఫ్ ఆర్మీ సామ్ మాణిక్ షా బయోపిక్‌లో నటించనున్నారు. కరణ్ జోహర్ రూపొందించే తఖ్త్ చిత్రంలో నటిస్తున్నారు.

  English summary
  Bollywood's young hero Vicky Kaushal spotted at Katrina Kaif's residence on August 9th. This proved support that They had a relationship. There rumours that Katrina, vick are dating quite sometime.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X