Vidya Balan: విద్యాబాలన్ మార్పింగ్ వీడియోస్ ట్రెండింగ్..
బాలీవుడ్ నటి విద్యా బాలన్ 'డర్టీ పిక్చర్' చిత్రంతో తెలుగు ఆడియెన్స్ నే కాదు సౌత్ మొత్తం సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. తెలుగులో నందమూరి నటసింహం, బాలకృష్ణ సరసన 'ఎన్టీఆర్ కథానాయకుడు', ఎన్టీఆర్ మహానాయకుడు' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆమె తెలుగులో నటించిన చిత్రాలు ఈ రెండు మాత్రమే. అయినప్పటకీ ఈ బ్యూటీ హిందీలో పలు ఛాలెంజింగ్ పాత్రలు, బోల్డ్ కంటెంట్స్ తో వెండితెరపై మెరవడంతో విద్యాబాలన్ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆమె పాత్రకు మినిమమ్ క్రేజ్ దక్కుతుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం విద్యా బాలన్ పేరు ఇంటర్నెట్ లో మారుమోగుతోంది. ఆమెకు సంబంధించిన ఏఐ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుండటంతో తాజాగా బాలీవుడ్ క్రేజీ నటి విద్యా బాలన్ స్పందించింది. డీప్ ఫేక్ వీడియో అంటూ క్లారిటీ ఇస్తూ సుధీర్ఘమైన నోట్ ను విడుదల చేసింది. అందుకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోను కూడా తన అఫీషియల్ అకౌంట్ లో పోస్ట్ చేసి తన అభిమానులను ఇలాంటి ఫేక్ వీడియోలను చూసి మోసపోవద్దని చెప్పుకొచ్చింది.

విద్యా బాలన్ పోస్ట్ ప్రకారం.. ప్రస్తుతం సోషల్ మీడియా, వాట్సాప్ లో నాకు సంబంధించినట్టు చూపిస్తున్న అనేక వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఆ వీడియోలతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. అవన్నీ AI-జనరేటెడ్ వీడియోస్. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. అయితే ఆ వీడియోలన్నీ అసమర్థమైనవి. నేను ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ఆ వీడియోలు క్రియేట్ చేయడంలో, సర్క్యూలేషన్ లో నాకు ఎటువంటి ప్రమేయం లేదు.
ఆ వీడియోల్లో చెబుతున్న కంటెంట్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏ విధంగానూ ఆమోదించను. అందుకు ప్రజలు, అభిమానులు, ఫాలోవర్స్ ఆ వీడియోల్లో చేసిన ప్రకటనలు, అసత్య ప్రచారాలను చూసి మోసపోకూడదు. నాకు ఆపాదించవద్దని తెలియజేస్తున్నాను. ఇంకా ఈ ఇలాంటి వీడియోల వల్ల నా పనికి ఎలాంటి ఆటంకం కలదని భావిస్తున్నాను. ఇలాంటి ఫేక్ వీడియోలను షేర్ చేసే ముందు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదని... తన సుదీర్ఘ నోట్ లో తెలియజేసింది. విద్యా బాలన్ తన డీప్ ఫేక్ వీడియోలపై స్పందించడంతో ఆ వీడియోలకు అడ్డుకట్ట వేసినట్లైంది.
మరోవైపు గతంలోనూ హీరోయిన్లు డీప్ ఫేక్ వీడియోల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గతేడాది నేషనల్ క్రష్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోను ఇంటర్నెట్ లో అక్రమాలకు పాల్పడే వారు సృష్టించి వ్యాప్తి చేసిన సంగతి తెలిసిందే. దానిపై ఇండియాలోని బడా హీరోలంతా కూడా స్పందించారు. రష్మికకు అండగా నిలిచారు. ఇక ఆ తర్వాత బాలీవుడ్ హీరోయినా కత్రినాకు అలాంటి చేధు అనుభవం ఎదురైంది. మళ్లీ ఇప్పుడు విద్యా బాలన్ కు వ్యాపార ప్రకటనల్లో తన ఫేస్ ను వాడి డీప్ ఫేక్ చేసిన వీడియోలతో షాక్ తగిలింది. దీనిపై ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని విద్యా బాలన్ అభిమానులు, నెటిజన్లు కోరుతున్నారు.


Click it and Unblock the Notifications











