నకిలీ ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌తో వసూళ్ల దందా.. నెటిజన్‌పై స్టార్ హీరోయిన్ కేసు నమోదు!
సోషల్ మీడియా ప్రపంచంలో హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, దర్శకుల పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేయడం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం. చాలా మంది తమకు నచ్చిన యాక్టర్ల పేరుతో అకౌంట్స్ క్రియేట్ చేసి తమ అభిమానాన్ని ప్రదర్శించుకొంటుంటారు. కానీ ఓ సీనియర్ హీరోయిన్ పేరుతో ఇన్స్‌టాగ్రామ్‌లో అకౌంట్ క్రియేట్ చేసి వసూళ్ల దందాకు తెరలేపడంతో సదరు స్టార్ హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సీనియర్ నటి ఫిర్యాదు విషయానికి వస్తే..
బాలీవుడ్‌లో సీనియర్ నటి విద్యాబాలన్‌కు ఆఫ్‌లైన్‌లోనే కాకుండా ఆన్‌లైన్‌లో విశేషంగా ఫాలోవర్స్ ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఆమె కూడా తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఫ్యాన్స్ టచ్‌లో ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా తన పేరుతో ఓ వ్యక్తి అకౌంట్ ఓపెన్ చేసి దుర్వినియోగం చేస్తున్నారనే విషయం తెలుసుకొని విద్యాబాలన్ షాక్ అయ్యారు.

తాజా సమాచారం ప్రకారం.. విద్యాబాలన్ పేరుతో జీమెయిల్, ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాడు. ఆ అకౌంట్‌ను కొంత కాలంగా మెయింటెన్ చేస్తున్నాడు. అలా ఆ అకౌంట్‌తో బాలీవుడ్ ప్రముఖులతో టచ్‌లో ఉంటూ వస్తున్నాడు. వారితో కమ్యూనికేషన్ కొనసాగిస్తున్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఇటీవల ఆ నెటిజన్ ప్రముఖులకు సందేశాలు పంపి వసూళ్ల దందా మొదలుపెట్టడం అసలుకే మోసం చేసింది.
విద్యాబాలన్ పేరుతో ఫేక్ ఇన్సాటాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసిన నెటిజన్.. ఇతరుల నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. కొందరికి జాబ్స్ ఇప్పిస్తానని చెప్పి సొమ్ములు లాగాడు. ఈ వ్యవహారం విద్యాబాలన్ దృష్టికి రావడంతో ఆమె వెంటనే స్పందించి ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది.

ఖార్ పోలీసుల వెల్లడించిన ప్రకారం.. తన పేరును దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో డబ్బులు వసూలు చేస్తున్నాడని విద్యాబాలన్ ఫిర్యాదు చేసింది. దాంతో సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకారం సెక్షన్ 66 (C) కింద కేసు నమోదు చేశాం అని తెలిపారు. ఆ వ్యక్తి గురించి సమాచారం సేకరించాలని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాం అని తెలిపారు.
విద్యాబాలన్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన నీయత్ అనే సినిమా 2023 సంవత్సరంలో రిలీజైంది. ప్రస్తుతం ఆమె నటించిన దో ఔర్ దో ప్యార్ సినిమా రిలీజ్‌కు సిద్దంగా ఉంది. అలాగే బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి భూల్ భులయ్యా 3 చిత్రంలో నటించేందుకు అంగకీరించింది. ఈ సినిమాలో మంజులికా పాత్రను పోషిస్తున్నది. భూల్ భులయ్యా సినిమాలో కూడా అదే పాత్రలో కనిపించి కనువిందు చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











