twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ నిర్మాత ప్రవర్తనతో చాలా బాధ పడ్డా... నాపై నాకే అసహ్యమేసింది: విద్యా బాలన్

    |

    విద్యా బాలన్ బాలీవుడ్ ప్రముఖ నటీమణుల్లో ఒకరిగా ఎదిగారు. అయితే ఇండస్ట్రీలో ఆమె జర్నీ సాఫీగా సాగింది అని చెప్పడానికి ఏమీ లేదు. 2005 వచ్చిన 'పరిణీత' మూవీతో తొలి విజయం రుచి చూసినప్పటికీ.. 2017‌లో వచ్చిన తుమ్హారీ సులు వరకు పలు విజయాలు, ప్లాపులు ఎదుర్కొన్నారు. కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా, సౌత్ సినీ పరిశ్రమలో కూడా ఆమె నటించారు.

    తాజాగా విద్యా బాలన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... తన సౌత్ సినీ ప్రయాణం పూలబాట ఏమీ కాదని తెలిపారు. అక్కడ తాను చాలా తిరస్కరణలకు గురైనట్లు వెల్లడించారు. అందులో మలయాళ చిత్రాలు, తమిళ చిత్రాలు ఉన్నాయి. కొన్నింటిలో నన్ను రీప్లేస్ చేశారు. ఓ తమిళ సినిమా చేస్తుండగా నన్ను ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు తోసేశారు. ఆ సమయంలో నా పేరెంట్స్ కూడా వెంట వచ్చేవారు అని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

    ఆ నిర్మాత మాటలు బాధించాయి

    ఆ నిర్మాత మాటలు బాధించాయి

    సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఇలా జరుగుతుండటంతో వారు చాలా బాధ పడేవారు. నాకు నేను మసకబారుతున్నట్లు అనిపించేది. మేము నిర్మాతల కార్యాలయానికి వెళ్ళేవారం. నిర్మాత సినిమా క్లిప్పింగులను మాకు చూపించి ఇలా అనేవాడు ‘ఒక్కసారి ఆమెను చూడండి, ఆమె హీరోయిన్‌లా ఉందా? ఈవిడను తీసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ దర్శకుడు పట్టుబట్టాడు' అని చెప్పేవాడని, అతడి మాటలు తనను ఎంతో బాధించేవని విద్యా బాలన్ గుర్తు చేసుకున్నారు.

    చాలా సినిమాల నుంచి నన్ను తీసేశారు

    చాలా సినిమాల నుంచి నన్ను తీసేశారు

    ‘వారు ఆల్రెడీ నా స్థానాన్ని వేరే వారితో రీప్లేస్ చేసేవారు. ఆ తర్వాత మా నాన్నకు చెప్పేవారు. సమస్య ఏమిటి అని తెలుసుకోవడానికి మా నాన్న ప్రయత్నించేవారు. వారు ఎందుకు ఇలా చేస్తున్నారో నాన్నకు సరైన కారణం చెప్పేవారు కాదు' అని విద్యా బాలన్ తెలిపారు.

    నాపై నాకే అసహ్యం వేసేది

    నాపై నాకే అసహ్యం వేసేది

    తిరస్కరణకు గురైన సమయంలో ఆ పరిస్థితులను డీల్ చేయడం కష్టంగా అనిపించేది. నాపై నాకే అసహ్యం వేసేది. అద్దంలో నా మొహం చూసుకోవడానికి కూడా ఇష్టం ఉండేది కాదు. కొన్ని నెలల పాటు నాకు నేను sh*tగా ఫీలయ్యాను. చాలా కాలం పాటు నన్ను అలా అన్న వ్యక్తిని క్షమించలేదు, కానీ ఈ రోజు నాకు అలా జరిగిందే మంచింది అనిపిస్తోంది. ఎందుకంటే నన్ను నేను ప్రమించుకుంటూ, యాక్సెప్ట్ చేసుకునే పరిణితి నాలో వచ్చిందని విద్యా బాలన్ చెప్పుకొచ్చారు.

    మరో పీడకల లాంటి అనుభవాన్ని విద్యా బాలన్ పంచుకుంటూ

    మరో పీడకల లాంటి అనుభవాన్ని విద్యా బాలన్ పంచుకుంటూ

    మరో పీడకల లాంటి అనుభవాన్ని విద్యా బాలన్ పంచుకుంటూ "మరొక తమిళ చిత్రం ఫోన్లో ఓకే అయింది. ఇప్పటి మాదిరిగా సెలక్షన్ జరుగలేదు. సినిమా గురించి పెద్దగా తెలుసుకోకుండా ఓకే చెప్పాను. షూటింగ్ కోసం చెన్నై వెళ్లాను.. ఒక రోజు చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఆ సినిమాలో వాడిన కామెడీ నాకు ఇబ్బందిగా అనిపించింది. వెంటనే తప్పుకున్నాను. వారు నాకు లీగల్ నోటీసులు కూడా పంపారు అని విద్యా బాలన్ గుర్తు చేసుకున్నారు.

    విద్యా బాలన్

    విద్యా బాలన్

    విద్యా బాలన్ సినిమాల విషయానికొస్తే ఆమె నటించిన ‘మిషన్ మంగళ్' ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా, నిత్యా మీనన్, తాప్సీ పన్నూ, కీర్తి కుల్హారీలతో కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 11 రోజుల్లో రూ. 164 కోట్లు వసూలు చేసి రూ. 200 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.

    English summary
    Vidya Balan's nightmarish experience with Tamil producer. "The producer showed us the clippings from the film and he said, 'Just look at her, does she look like a heroine. He said 'I was not in favour of taking her at all, it was the director who insisted." Vidya Balan said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X