విద్యాబాలన్ కెవ్వుకేక.. వెండితెరపై ఎమోషనల్ బయోపిక్.. ఫస్ట్ లుక్ విడుదల
మిషన్ మంగళ్ సక్సెస్‌ను ఓ వైపు ఎంజాయ్ చేస్తూనే విద్యా బాలన్ వరుసగా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం గణితశాస్త్ర మేధావి, హ్యాుమన్ కంప్యూటర్ శకుంతలా దేవి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. గతంలో ఓ సందర్భంగా మాట్లాడుతూ.. శకుంతలాదేవిపై ప్రశంసలు కురిపించారు. ఆమె గొప్ప సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న మహిళ, ప్రతిభావంతురాలు అని చెప్పారు.
దర్శకుడు అను మీనన్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శకుంతలా దేవి అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. అలాంటి గొప్ప మహిళ జీవితం ఆధారంగా సినిమాలో నటించే అవకాశం రావడం గర్వంగా ఉంది. ఆమె అత్యంత ప్రతిభావంతురాలైన మహిళ అని విద్యా బాలన్ అన్నారు.

శకుంతలాదేవి బయోపిక్ కోసం యూనిట్ మొత్తం చాలా గొప్పగా పనిచేసింది. టీమ్ విజన్ చాలా గొప్పగా ఉండేది. వెండితెర మీద ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ప్రతీ ఒక్కరి గుండెను ఆమె జీవితం తడుతుంది. స్ఫూర్తిగా నిలుస్తుంది అని విద్యా బాలన్ అన్నారు.
అత్యంత ప్రతిభావంతురాలైన శకుంతలాదేవి తన టాలెంట్‌తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కి ఎక్కింది. చాలా చురుకుగా లెక్కలు చెప్పడం అందర్నీ విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











