ఎక్స్‌పోజింగ్ చేస్తోందా లేక ఎంజాయ్ చేస్తోందా? డర్టీ భామ ఓపెన్ షో
బాలీవుడ్ భామ విద్యాబాలన్ సరికొత్త పంథాలో వెళుతోంది. గ్లామర్ లుక్స్‌తో 'డర్టీ పిక్చర్' సృష్టించిన సంచలనం ఈ భామ దేశ వ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంటోంది. ఒక్క బాలీవుడ్ చిత్రసీమకే పరిమితం కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు కూడా తన బబ్లీ అందాల రుచి చూపిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాను కూడా వదలడం లేదు. తన గ్లామర్ లేదు, హాట్ నెస్ లేదు అనే వారికి చుక్కలు చూపించేలా స్పైసీ లుక్స్ పోస్ట్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా విద్యాబాలన్ షేర్ చేసిన ఓ పిక్ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. ప్రస్తుతం బాలి వెకేషన్ లో ఉన్న ఆమె అక్కడి బీచ్‌లో సేద తీరుతూ వయ్యారాలు ఒలకబోసింది. బీచ్ ధర్మానికి విరుద్ధంగా బికినీలు, మోనోకినిలకు బదులుగా ఓ కొత్తరకం గౌన్ వేసుకొని హాట్ లుక్ ఇచ్చింది విద్య. బీచ్ లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ తనలోని డర్టీ యాంగిల్ ని బయటపెట్టేసింది. ఇంతకీ ఆమె ఎక్స్‌పోజింగ్ చేస్తోందా లేక ఎంజాయ్ చేస్తోందా? అనేది అర్థం కాకుండా తనదైన స్టైల్ లో కుర్రకారుకు మైకం కమ్మే ఫోజిచ్చింది. ఫుల్ గౌన్ అయినప్పటికీ తన అందాలను పూర్తిగా ధారపోస్తూ ముందుకు వంగి మాయ చేసింది విద్యాబాలన్. పైగా దీనిపై 'జాయ్' అనే క్యాప్షన్ పెట్టింది. అలా పోజిచ్చిన ఆమెకే అంత జాయ్ ఉంటే.. అది చూసిన కళా పోషకులకు డబల్ జాయ్ ఉండదా మరి.

డర్టీ భామలోని ఈ యాంగిల్ యువ హృదయాలకు బాగా దగ్గరైంది. దీంతో ఈ పిక్ పై లైకుల వర్షం కురిపిస్తూ విద్యాబాలన్ అందాన్ని అభివర్ణిస్తున్నారు నెటిజన్లు. ఇక ఇటీవలే ఎన్టీఆర్ భార్య బసవతారకంగా హోమ్లీ లుక్ లో తెలుగు తెరకు శోభ తెచ్చిన విద్యా బాలన్.. ప్రస్తుతం 'మిషన్ మంగల్' అనే సినిమాలో, దీంతో పాటు అజిత్ హీరోగా రానున్న తమిళ చిత్రం 'నేర్కొండ పార్వై' లో కూడా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











