పెళ్లిపై విద్యా బాలన్ షాకింగ్ కామెంట్స్.. ఇలా కూడా ఆలోచిస్తారా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ నార్త్ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక హిందీలపై దక్షిణాది ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపించడం, విద్యా బాలన్ నటించిన కొన్ని చిత్రాలు డబ్డ్ వెర్షన్ లో సౌత్ లోనూ విడుదల కావడంతో తనకు ఇక్కడ మంచి క్రేజ్ దక్కింది. తన చిత్రాలపై ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక విద్యా బాలన్ గురించిన విషయాలను తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో విద్యా బాలన్ పెళ్లిపై ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారాయి. ఇంతకీ తన అభిప్రాయం ఏంటనే వివరాల్లోకి వెళితే..
తొలుత మ్యూజిక్ వీడియోలతో..
విద్యా బాలన్ తొలుత మ్యూజిక్ వీడియోల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. బెంగాలీ భాషల్లో రూపుదిద్దుకున్న ఆనా మేరా గల్లీ, మై నషే మే హూ, కిసూన్ కి చదర్, జానీ నా వంటి సాంగ్స్ తో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ వీడియో సాంగ్స్ తోనే నటిగా అవకాశాలు దక్కించుకుంటూ వచ్చింది. అంతకు ముందే 'హమ్ పాంచ్' అనే సీరిస్ తో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత బెంగాలీ చిత్రం 'భలో టీకో' అనే చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

బాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ గా..
హిందీ ప్రేక్షకుల్లో విద్యా బాలన్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తొలుత పరిణిత, లగే రహో మున్నా బాయ్, గురు, ఎక్ లవ్య, భూల్ బులయ్య, ఓం శాంతి ఓం వంటి చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత పా, ఇష్కియా, దమ్ మారో దమ్, ది డర్టీ పిక్చర్, కహానీ, బాంబే టాక్సీస్, హమారీ అదూరి కహానీ, కహానీ 2, మిషన్ మంగల్ వంటి చిత్రాలతో బాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. ముఖ్యంగా ది డర్టీ పిక్చర్ చిత్రంతో బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోనూ మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇక తెలుగులోనూ 'ఎన్టీఆర్ : కథనాయకుడు' చిత్రంలో నటించి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.
పెళ్లిపై విద్యాబాలన్ షాకింగ్ కామెంట్స్..
విద్యా బాలన్ కు ప్రస్తుతం 46 ఏళ్లు ఉంటాయి. ఇక ఐదు పదుల వయస్సుకు దగ్గరవుతున్నా ఈమె ఇంకా పెళ్లికి దూరంగానే ఉంది. అయితే ఆమె పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందని అభిమానులు ఎంతగానో ఎదురు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై తను చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
పెళ్లిపై విద్యాబాలన్ అభిప్రాయాన్ని తెలిసింది. 'పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది. కానీ ఇండియాలో ఒకరిని పెళ్లి చేసుకుంటే కుటుంబాన్ని మొత్తం చేసుకున్నట్టే. అది చెత్త పని. ఇద్దరు భార్యభర్తలు కలిసి ఉంటారా లేదా అన్నది వాళ్లద్దరికి మాత్రమే సంబంధించింది. అంతే కానీ వారి గురించి బహిరంగంగా మాట్లాడాల్సిన పనిలేదు... అని చెప్పుకొచ్చింది. గతంలో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











