For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లవర్ తో సీక్రెట్ గా పెళ్లి.. షాకిచ్చిన టాలీవుడ్ నటి.. అప్పుడు కూడా అలానే!

  |

  తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ సడన్ గా పెళ్లి చేసేసుకుని షాకిచ్చింది. ఆమె తెలుగు వారికి కూడా సుపరిచితురాలు. ముందు తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆమె ఆ తర్వాత కొన్ని స్ట్రెయిట్ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. అయితే ఆమె పెళ్లి చేసుకోవడమే కాక ఆ ఫోటోలు కూడా షేర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

  అలా ఎంట్రీ

  అలా ఎంట్రీ

  విద్యుల్లేఖ తన విద్యాభ్యాసం విద్యా మందిర్ సీనియర్ సెకండరీ స్కూల్లో చేసింది. తరువాత మెట్రిక్యులేషన్‌కు MCTM వెళ్లింది, అక్కడ ఆమెకు థియేటర్ మరియు నటన పట్ల ఆసక్తి ఏర్పడింది. ఆమె వైష్ణవ్ కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఇక ఆమెకు 7 సంవత్సరాలకు పైగా థియేటర్ అనుభవం ఉంది. ఆమె గౌతమ్ మీనన్ యొక్క 2012 ద్విభాషా చిత్రాలైన నీతనే ఎన్ పొన్వసంతం మరియు ఎటో వెళ్ళిపోయింది మనసులో నటించింది, ఇందులో సమంత పాత్ర పోషించిన జెన్నీ స్నేహితురాలిగా కనిపించింది.

  బ్యాక్ గ్రౌండ్ పెద్దదే

  బ్యాక్ గ్రౌండ్ పెద్దదే

  విద్యుల్లేఖ తమిళ టెలివిజన్ నటుడు మోహన్ రామన్ కుమార్తె, ఆమె తాత ప్రముఖ న్యాయవాది V. P.రామన్. ఇక ఆమె బాబాయి పిఎస్ రామన్ తమిళనాడు మాజీ అడ్వకేట్ జనరల్. విద్యుల్లేఖ కజిన్ గీతాంజలి ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు సెల్వరాఘవన్‌ను వివాహం చేసుకుంది. ఇక విద్యుల్లేఖ 26 ఆగస్టు 2020 న సంజయ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు మరియు దానిని ఇంస్టాగ్రామ్ లో ప్రకటించారు.

  సీక్రెట్ గా వివాహం

  సీక్రెట్ గా వివాహం

  ఇండస్ట్రీలో ప్రముఖ లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ సీక్రెట్ గా వివాహం చేసేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో విద్యుల్లేఖ అనేక చిత్రాల్లో కమెడియన్ గా, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలో నటించి మెప్పించింది. ఆగస్టు నెలలో ఎవరూ ఊహించని విధంగా విద్యుల్లేఖ ఎంగేజ్మెంట్ చేసుకోగా ఇప్పుడు కూడా ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పెళ్లి తంతు కూడా కానిచ్చింది. దీంతో సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

  ఎంగేజ్మెంట్ లాగానే పెళ్లి కూడా

  ఎంగేజ్మెంట్ లాగానే పెళ్లి కూడా

  నిజానికి ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడే విద్యుల్లేఖ వివాహం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కానీ అనూహ్యంగా గురువారం నాడు అంటే నిన్న సెప్టెంబర్ 9న విద్యుల్లేఖ పెళ్లి పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే అది ప్రేమ వివాహం కావడం విశేషం, గతంలో ఆమె లావుగా ఉండేది, దీంతో ఆమె శరీరాకృతి గురించి సినిమాల్లో జోకులు కూడా పెట్టేవారు మన దర్శకులు.

  Daare Leda Team interview part 3. Real life doctor roopa Shares her life experiences In covid times
   అతనితో ప్రేమలో

  అతనితో ప్రేమలో


  ఏమనుకుందో ఏమో కానీ లాక్ డౌన్ లో డెసిషన్ తీసుకుని తాను కూడా గ్లామర్ గా మారగలదని విద్యుల్లేఖ నిరూపించింది, ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టి అప్పుడు తన ఫిట్నెస్ ట్రైనర్ ఇప్పుడు భర్త అయిన సంజయ్ హెల్ప్ తో విద్యుల్లేఖ నాజూగ్గా మారింది. అలా తనకు హెల్ప్ చేయడానికి వచ్చిన అతనితో ప్రేమలో పడిన ఆమె అతనినే వివాహం చేసుకుంది. విద్యుల్లేఖ తెలుగులో ధృవ, రాజా ది గ్రేట్, సరైనోడు లాంటి చిత్రాల్లో తనదైన శైలిలో నటించింది. చివరగా అల్లుడు అదుర్స్ చిత్రంలో విద్యుల్లేఖ నటించింది. ఆమె నటించిన గల్లీ రౌడీ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.

  English summary
  Actor Vidyullekha Raman gets married to entrepreneur and her coach Sanjay in a private function.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X