Nayanthara: నయనతారకు విఘ్నేశ్‌ ఖరీదైన బహుమతి.. దాని ధర ఎన్ని కోట్లో తెలుసా?

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. నవంబర్‌ 18న నయనతార 41వ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నయనతారకు ఆమె భర్త విఘ్నేశ్‌ (Vignesh Shivan) ఖరీదైన బహుమతి ఇచ్చారు. ఇంతకీ ఆ ఖరీదైన బహుమతి ఏంటీ? దాని విలువ ఎన్ని కోట్లంటే?

సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీ కపుల్స్ లో నయనతార-విఘ్నేశ్ శివన్ జంట ఎప్పుడూ ముందుంటుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు చూపించే ప్రేమ, గౌరవం అభిమానులను ఆకట్టుకుంటుంది. వారు తమ జీవితంలో ప్రతి మూమెంట్ ఫ్యాన్స్ తో పంచుకుంటారు. తాజాగా నయనతార 41వ ఏటకి అడుగుపెట్టగా, ఈ పుట్టిన రోజు వేడుకను మరింత స్పెషల్ చేయడానికి భర్త విఘ్నేశ్ శివన్ మరోసారి భారీ సర్ప్రైజ్ ఇచ్చారు.

Vignesh Shivan Surprises Nayanthara With a Rs 10 Crore Rolls-Royce Spectre on Her Birthday

ఈ సారి నయనతారకు విఘ్నేశ్ ఇచ్చిన బహుమతి పరిశ్రమ అంతా మాట్లాడుకునే అంశంగా మారింది. దాదాపు రూ.10 కోట్లు విలువ చేసే రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ కారును విఘ్నేశ్ శివన్ తన భార్యకు పుట్టినరోజు సర్‌ప్రైజ్‌గా అందించారు. ప్రతి ఏడాది లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చే విఘ్నేశ్, ఈసారి లెవెల్‌ను మరింత పెంచి అత్యంత ప్రీమియం, లిమిటెడ్ ఎడిషన్ కారును కొనివ్వడం విశేషం. ఈ సందర్బంగా నయనతార - విఘ్నేశ్ తమ ఇద్దరు పిల్లలతో కలిసి కొత్త కారుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.

నయనతారకు విఘ్నేష్ ఇలాంటి ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2023లో నయన్‌కు రూ.3 కోట్లు విలువైన మెర్సిడెస్ మేబ్యాచ్, 2024లో రూ.5 కోట్లు విలువైన మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ GLS 600ను విఘ్నేశ్ బహుమతిగా ఇచ్చారు. వరుసగా మూడు సంవత్సరాలుగా విఘ్నేశ్.. తన లెవెల్‌లో కారులను బహుమతులుగా ఇస్తున్నారు. ఈసారి మాత్రం ఆ రేంజ్‌ను డబుల్ చేసి రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఇవ్వడం నయన్ పుట్టినరోజును మరింత గ్రాండ్‌గా మార్చింది.

ఇదిలా ఉండగా, నయనతార అత్యంత బిజీ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మొత్తం తొమ్మిది ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి సరసన 'మన శంకర వర ప్రసాద్ గారు', అలాగే నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లోని హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ (#NBK111) లో 'మహారాణి' పాత్రలో నటిస్తున్నారు. తమిళంలో 'మూకుత్తి అమ్మన్ 2'తో పాటు మరికొన్ని చిత్రాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నయనతార తనను 'లేడీ సూపర్ స్టార్' అని పిలవొద్దని చెప్పినా, అభిమానులు మాత్రం ఆ టైటిల్‌ను వదలే ప్రసక్తే లేదు. ఆమె పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో భారీగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.కొత్త పోస్టర్లు, షూటింగ్ స్టిల్స్, బర్త్‌డే విషెష్ చేశారు. ఇందులో విఘ్నేశ్ ఇచ్చిన 10 కోట్ల రోల్స్ రాయిస్ గిఫ్ట్ మాత్రం ఈ వేడుకలో హైలైట్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X