విజయ్ సరసన మూడోసారి.. కీర్తి సురేష్‌కు మరో క్రేజీ ఆఫర్!
ఇళయదళపతి విజయ్ కొత్త చిత్రానికి రంగం సిద్ధం అయింది. సంచలన దర్శకుడు అట్లీ, విజయ్ హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కబోతున్న చిత్రం నేడు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మెర్సల్, తేరి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. దీనితో ఈ హ్యాట్రిక్ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. భారతదేశంలో క్రీడల్లో జరుగుతున్న రాజకీయాలపై అట్లీ ఈ చిత్రం ద్వారా అస్త్రం సందించబోతున్నట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లకు ప్రాధాన్యత ఉందని.. నయనతార ఓ హీరోయిన్ గా ఎంపిక కాగా మరో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఎంపిక చేశారు. ఈ చిత్రంలో విజయ్ ఫుట్ బాల్ కోచ్ పాత్రలో నటిస్తాడట. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. మెర్సల్ చిత్రంలో వైద్య రంగంపై గురిపెట్టిన అట్లీ ఈ చిత్రంలో క్రీడారంగంపై ద్రుష్టి పెట్టాడు.

విజయ్ నటిస్తున్న చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధిస్తున్నాయో అదేవిధంగా వివాదం కూడా అవుతున్నాయి. అట్లీ, విజయ్ ఈ చిత్రంతో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో వేచి చూడాలి. ఏజిఎస్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











