Rashmika Mandanna: మళ్లీ అడ్డంగా బుక్ అయిన రష్మిక మందన్నా... పక్కా ప్రూఫ్‌తో దొరికిపోయిందిగా!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా... అవసరమే లేదు.. టీనేజ్ కుర్రాడి దగ్గర నుంచి.. 60 ఏళ్ల ముసలి వాళ్ల వరకు ఈ బ్యూటీ గురించి తెలిసిందే. పుష్ప సినిమాతో ఈ భామ.. పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ కొట్టేసి.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ భామ నెటిజన్ల చేతిలో మరోసారి అడ్డంగా బుక్ అయిపోయింది. నిన్న తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా రష్మిక ఓ పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్స్... ఈ భామ ఎక్కడ ఉందో పసిగట్టేశారు. ఈ బ్యూటీ ఏం పోస్ట్ పెట్టింది.. నెటిజన్స్ ఏం పట్టేశారు అనేది... ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా... కిర్రాక్ పార్టీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఆ సినిమా హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం నడిపి.. పెళ్లి పీటలవరకు వెళ్లింది. ఏమైందో తెలియదు.. కానీ ఇంతలో పెళ్లి బ్రేకప్ చేసుకుని.. సినిమాలు చేసుకోవడం మొదలు పెట్టింది ఈ భామ. కన్నడంలో వరుస ఆఫర్లు వస్తున్న వేళ.. తెలుగులో ఛలో అనే సినిమాలో నటించి.. అందరి దృష్టిని ఆకర్షించింది. నాగ శౌర్యతో కలిసి నటించిన ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది.

Vijay Devarakonda Rashimika Mandanna Once Again Unofficially Confirming They are Living Together Photos Goes Viral

ఇక తెలుగులోనూ అవకాశాలు వెల్లువెత్తాయి. గీతా గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా షూటింగ్ లోనే రష్మిక పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇక విజయ్ ఎంట్రీతో పెళ్లి బ్రేక్ చేసుకుందనే వాదనలు కూడా వినిపించాయి. ఇక వీరు గతకొంత కాలంగా లివింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తునే ఉన్నాయి. వీటిపై విజయ్ దేవరకొండ కానీ, రష్మిక మందన్నా కానీ ఎవరు స్పందించలేదు.

ఇక వీరు ఫోటోస్ దిగడం.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం... రష్మిక దిగిన ఫోటోలు.. విజయ్ దేవరకొండ దిగిన ఫోటోలు లొకేషన్ ఒక్కటే కావడం... నెటిజన్స్ గుర్తిస్తూ రావడం జరుగుతూనే ఉంది. ఈ ఫోటోలు వైరల్ అయిన ప్రతిసారి వీరు ప్రేమలో ఉన్నట్లు నెటిజన్స్ గుర్తింస్తున్నారు. అంతే కాదు.. విజయ్, రష్మిక ఆ మధ్య వెకేషన్ కు కూడా పోయారంటూ వార్తలు వచ్చాయి. ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఇది చూసిన నెటిజన్స్... వీరు ప్రేమలో ఉన్నారని.. కలిసి ఉంటున్నారని కామెంట్స్ చేస్తూ ఫ్రూవ్స్ సహా బయటపెడుతున్నారు.

Vijay Devarakonda Rashimika Mandanna Once Again Unofficially Confirming They are Living Together Photos Goes Viral

మొన్న దీపావళి పండక్కి కూడా రష్మిక విజయ్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందని నెటిజన్స్ గుర్తించారు. ఇక ఇప్పుడు తాజాగా మరో విషయం కనిపెట్టారు నెటిజన్స్. నిన్న రష్మిక రికవరీ ఇస్ ఇంపార్టెంట్ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. అందులో రష్మిక పడుకుని ఉంది. వెనకలా కబోర్డ్స్ ఉన్నాయి. ఈ ఫోటో వరకు ఓకే... ఇక విజయ్ దిగిన ఓ పాత ఫోటో.. రష్మిక ఇప్పుడు దిగిన ఈ ఫోటో చూస్తే లొకేషన్ ఒక్కటే. దీంతో వీరు ఒకే దగ్గర ఉండి దాగుడు మూతలు ఆడుతున్నట్లు నెటిజన్స్ పసిగట్టారు.

గతంలో నాగచైతన్య, సమంత కూడా ఇలాగే చేసి పెళ్లి చేసుకున్నారట. ఇప్పుడు ఈ జంట దాగుడు మూతలు ఆడుతూ.. నెటిజన్స్ కు పరీక్ష పెడుతుంది. ఇప్పుడు మరోసారి విజయ్ రష్మిక పోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం రష్మిక మందన్నా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ అనే సిినిమాలో నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు మృణాల్ ఠాకూర్ తో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్. మరి వీరిద్దరు నిజంగా ప్రేమలో ఉన్నారా.. కావాలని ఆట పట్టిస్తున్నారా అనేది తేలాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X