బర్త్ డే నాడే ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన విజయ్.. దెబ్బకు షాక్ అయిన సమంత
నాగచైతన్యతో విడాకులు ప్రకటన తర్వాత సమంత మొట్టమొదటి పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి కురిశాయి. అయితే సరిగ్గా పుట్టినరోజు సమయానికి సినిమా షూటింగ్ లో భాగంగా కాశ్మీర్ లో ఉన్న ఆమెకు సినిమా యూనిట్ షాకిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

పుట్టినరోజు నాడే
నాగ చైతన్యతో విడాకులు ప్రకటన తర్వాత సమంత మొట్ట మొదటి పుట్టినరోజు 2022 వ సంవత్సరంలో జరుపుకుంది. అయితే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత తన షెడ్యూల్ అంతా బిజీ బిజీగా గడిపేలా ప్లాన్ చేసుకున్న సమంత ఎక్కడా కూడా తాను వేరే విషయాల మీదకు మనసు మళ్ళకుండా సినిమాల్లో నటిస్తూనే ఉంది. అందులో భాగంగా ఆమె వరుస సినిమాలు ఒప్పుకుంది. ఇప్పటికే ఆమె నటించిన తమిళ సినిమా తెలుగులో కన్మణి రాంబో ఖతీజా విడుదలైంది.

మూడు కోట్ల మార్కెట్
ఈ సినిమాలో ఆమె విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అదే విధంగా ఈ సినిమా నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందింది. సరిగ్గా సమంత పుట్టిన రోజు నాడు విడుదలైన ఈ సినిమా మంచి స్పందన అయితే తెచ్చుకుంది. ఈ సినిమాకి టాక్ ఎలా ఉన్నా సరే కలెక్షన్లు రావడం ఖాయమని చెబుతున్నారు. తెలుగులో కూడా ఈ సినిమా దాదాపు మూడు కోట్ల వరకు మార్కెట్ చేసుకుంది.

కాశ్మీర్ కి
అయితే సమంత విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం కొద్ది రోజుల క్రితం సమంత కాశ్మీర్ కి తరలి వెళ్ళింది. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా సమంతకు ఊహించని షాక్ ఇచ్చింది సినిమా యూనిట్.

రిహార్సల్ కూడా
ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతున్న క్రమంలో సరిగ్గా సమంత పుట్టినరోజు సమయానికి ఒక సీన్ షూట్ చేయాలని దర్శకుడు శివ నిర్వాణ చెప్పారు. సమంతకు తన పుట్టిన రోజు అనే విషయం గుర్తు వున్నదో లేదో తెలియదు కానీ ఆమె ఏ మాత్రం చాలా సిన్సియర్ గా దర్శకుడు చెప్పాడు కదా అని రిహార్సల్ కూడా చేసుకుంది. విజయ్ దేవరకొండ కూడా చాలా సిన్సియర్ గా కూర్చున్నాడు.

షాక్ తిని
సీన్ ప్రకారం సమంత ఒంటరిగా కూర్చుని ఉన్న విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లి పదిరోజుల్లో వచ్చేస్తాను నువ్వు మా పేరెంట్స్ తో మాట్లాడటం కాదు నేను మీ వాళ్ళతో మాట్లాడే పెళ్లికి ఒప్పిస్తా అనే డైలాగ్ చెబుతుంది. ఆ సమయంలో విజయ్ దేవరకొండ ఆమెతో మాట్లాడుతూ చెంపను పట్టుకుని సమంత అనడంతో ఆమె ఒక్క సారిగా షాక్ అవుతుంది, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగానే విజయ్ హ్యాపీ బర్త్డే అని చెప్పడంతో ఆమె తన పుట్టిన రోజు అనే విషయం జ్ఞాపకం వచ్చినట్లు కాస్త నవ్వుతుంది. దీంతో సినిమా యూనిట్ సభ్యులందరూ కూడా ఆమెకి ఒక్క సారిగా శుభాకాంక్షలు తెలియజేశారు.. అలాగే కేక్ కూడా తెప్పించి కట్ చేయించారు. దీంతో సమంత సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయింది.


Click it and Unblock the Notifications











