అందుకే రష్మికకు భాగ్యశ్రీ కాంపీటిషన్.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్
స్టార్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా కింగ్డమ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. జూలై 31న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ముఖ్యంగా ఈ చిత్రానికి సంబంధించిన రిజల్ట్ పై అందరికీ ఆసక్తి నెలకొని ఉండగా.. మెజారిటీ పాజిటిట్ టాక్ నే సొంతం చేసుకుంది. కొంత మిశ్రమ స్పందన వచ్చిన విజయ్ దేవరకొండ క్రేజ్ ముందు తుడిచి పెట్టుకుపోతున్నాయి. ఇదిలా ఉంటే కింగ్డమ్ చిత్రం రిలీజ్ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటనకు కూడా ప్రశంసలు అందుతున్నాయి. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ ఆమెపైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.
కింగ్డమ్ చిత్రంతో భాగ్యశ్రీ..
భాగ్యశ్రీ బోర్సే బాలీవుడ్ చిత్రాలతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తొలుత హిందీలో రూపుదిద్దుకున్న యారియాన్ 2 అనే చిత్రంతో ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆ వెంటనే చందు ఛాంపియన్ అనే సినిమాతో మరింతగా ఆకట్టుకుంటుంది. ఆ రెండు చిత్రాల తర్వాత బాలీవుడ్ నుంచి నేరుగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. మాస్ మహారాజా నటించిన మిస్టర్ బచ్చన్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసుకుంది. ఆ చిత్రంలో తన నటనకు, తన రూప సౌందర్యానికి, డ్యాన్స్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఇక తాజాగా కింగ్డమ్ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే హాట్ టాపిక్ గ్గా మారింది.

విజయ్ కి షాకిచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండకు కింగ్డమ్ షూటింగ్ సమయంలో భాగ్యశ్రీ బోర్సే షాకిచ్చిందని రౌడీ స్టార్ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. కింగ్డమ్ సక్సెస్ మీట్ లో భాగ్యశ్రీ బోర్సే గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. స్పాట్ లోనే ఏ విషయాన్నైనా నేర్చుకునే అద్భుతమైన నటి తను అని చెప్పారు. శ్రీలంక అమ్మాయి పాత్రలో నటించిందని, దాంతో ఆమె సింహలిస్ భాషలో మాట్లాడాల్సి ఉంది.
ఓవర్ నైట్ లో..
తనకు రెండు డైలాగ్స్, ఆమెకు పేజీ డైలాగ్ ఉందని చెప్పారు. అయితే ఓవర్ నైట్ లో భాగ్యశ్రీ బోర్సే ఆ భాష నేర్చుకొని డైలాగ్స్ ను ఎఫెక్టివ్ గా చెప్పిందని పొగిడారు... ఇక రష్మిక మందన్నను కూడా సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రమోషన్స్ లోనూ మహేశ్ బాబు ఇలాంటి కాంప్లిమెంటే ఇచ్చారు. దీంతో భాగ్యశ్రీ బోర్సే తన కెరీర్ పై ఫుల్ ఫోకస్డ్ గా, ప్రతి రోల్ ను, సీన్ ను సీరియస్ గా తీసుకొని నటిస్తుందని విజయ్ దేవరకొండ చెప్పిన ఉదాహారణతో తెలిసిపోతోంది.
రష్మికకు కాంపిటీషన్?
ఇదే క్రమంలో భాగ్యశ్రీ బోర్సే రష్మిక మందన్నకు కాంపీటిషన్ గా మారుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక రష్మిక మందన్న సైతం తన సినిమాల కోసం ఎంతోగానో కష్టపడుతారు. ప్రతి పాత్రను కెమెరా ముందు చక్కగా ప్రదర్శిస్తూ టాలీవుడ్ దర్శక నిర్మాతలు, టెక్నీషియన్లు, ఆడియెన్స్ నుంచి భారీ ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే కూడా అలాంటి ప్రశంసలనే అందుకోవడం విశేషం. మరో రెండు చిత్రాలు పడితే టాలీవుడ్ లో రష్మికకు భాగ్యశ్రీ బోర్సేనే కాంపీటిషన్ అనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











