కియారా షాకింగ్ లుక్.. ప్యాంట్ వేసుకోవడం మరిచిందా? విజయ్ దేవరకొండతో కలిసి..
Recommended Video
కియారా అద్వానీ.. బాలీవుడ్ టు టాలీవుడ్ పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరిది. బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా కియారా అద్వానీ షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచింది. దీంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది కియారా. ఇంతకీ జరిగిందేంటి? వివరాల్లోకి పోతే..

బోల్డ్ లుక్స్‌లో జబర్దస్తీ
బోల్డ్ లుక్స్‌లో యూత్ ఆడియన్స్ మతిపోగొట్టడంలో కియారా అద్వానీ ఎప్పుడూ ముందే. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలతో మాయ చేస్తూ సోషల్ మీడియాను వేడెక్కిస్తుంటూ జనం నోళ్ళలో నానుతూ ఉంటుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్ నడుమ నిలబడి ఓ ఫోటోకి పోజ్ ఇస్తూ జబర్దస్తీ చేసింది.

ప్యాంట్ వేసుకోవడం మరిచిందా? లేక..
అయితే ఈ ఫోటో కియారా అద్వానీ వేసుకున్న డ్రెస్ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ ఫోటో చూస్తుంటే అసలు కియారా ప్యాంట్ వేసుకుందా? లేదా అనే ఫీలింగ్ కలుగుతోంది. పైగా ఇటు పక్క హీరో విజయ్ దేవరకొండ, అటు పక్క నిర్మాత కరణ్ జోహార్ ఉండటంతో ఈ పిక్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
నెటిజన్లు ఊరుకుంటారా..? వెంటనే
కియారా అద్వానీని ఇలా చూశాక నెటిజన్లు ఊరుకుంటారా..? వెంటనే తమ తమ కామెంట్లకు పదును పెట్టేశారు. ఏంటి.. కియారా ఇలా.. ప్యాంటు వేసుకోవడం మర్చిపోయావా? లేదా కావాలనే ఇలా పోజిచ్చావా అంటూ ట్రోల్స్ మొదలు పెట్టారు. ఈ మధ్యకాలంలో హీరోయిన్లపై ఇలాంటి ట్రోల్స్ బాగా పెరిగాయి. గతంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇలాగే ట్రోల్స్ బారిన పడిన సంగతి తెలిసిందే.

లస్ట్ భామ.. ప్రీతిగా
వెండితెర ప్రయాణంతో పాటు లస్ట్ స్టోరీస్ రూపంలో వెబ్ సిరీస్ ద్వారా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌ని షేక్ చేసింది కియారా. ఈ వెబ్ సిరీస్‌లో స్వయం తృప్తి పొందే మహిళగా నటించి భేష్ అనిపించుకుంది. ఇక ఇటీవలే 'కబీర్ సింగ్' సినిమాలో నటించి భారీ క్రెడిట్ పట్టేసింది. ప్రస్తుతం లక్ష్మిబాంబ్ సినిమాలో నటిస్తోంది కియారా అద్వానీ.


Click it and Unblock the Notifications











